Begin typing your search above and press return to search.

కోహ్లీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్య‌లు .. ఆత్మహత్య చేసుకోవాలని .. !

By:  Tupaki Desk   |   16 Nov 2021 6:30 AM GMT
కోహ్లీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్య‌లు .. ఆత్మహత్య చేసుకోవాలని .. !
X
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూతురి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ వాసిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌ లో పాకిస్థాన్‌ తో జరిగిన మ్యాచ్‌ లో భారత జట్టు ఓటమి అనంతరం జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లి కుమార్తెపై ఆన్‌ లైన్‌ లో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ముంబయి ప్రత్యేక విభాగం పోలీసులు హైదరాబాద్‌ కు చేరుకొని బుధవారం రామ్‌నగేశ్‌ అలిబత్తిని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసింది.

కాగా టీ20 ప్రపంచకప్‌ లో దాయాది దేశం పాక్‌ చేతిలో ఓటమి నేపథ్యంలో, కోహ్లి తొమ్మిది నెలల కుమార్తెను రేప్‌ చేస్తామంటూ ఆన్‌లైన్‌లో కొందరు బెదిరింపులకు పాల్పడినట్లు పలు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను సుమోటోగా తీసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ) డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (క్రైమ్‌) కు నోటీసు జారీ చేసింది. ఇది చాలా తీవ్రమైన విషయమని, తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొనడంతో పోలీసులు రంగంలోకి దిగి రామ్‌నగేశ్‌ అలిబత్తిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

ఈ విషయాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న ముంబైలోని వెస్ట్‌ రీజియన్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా నగేశ్‌ ఫోన్‌ ను పరిశీలించిన పోలీసులు అతడు ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు గుర్తించారు. దీనికోసం గూగుల్‌ లో వివిధ విధానాలను పరిశీలించాడు. అయితే, తల్లిదండ్రులపై ఉన్న ప్రేమ కారణంగా ఈ నిర్ణయాన్ని మార్చుకున్నాడని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. నగేశ్‌ వ్యాఖ్యలపై కేసు నమోదైన తర్వాత అనేకమంది అతడి ట్విట్టర్ నుంచి అన్ ఫాలో అయ్యారు. అప్పటివరకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వాళ్లు కూడా హఠాత్తుగా తప్పుకున్నారని వివరించారు.

సంగారెడ్డి జిల్లాకు చెందిన రాంనగేశ్‌ హైదరాబాద్‌ ఐఐటీ నుంచి సాఫ్ట్‌వేర్‌ విద్యనభ్యసించాడు. బెంగళూరు కేంద్రంగా పని చేసే ఓ ఫుడ్‌ డెలివరీ సంస్థల్లో ఉద్యోగం చేసిన నగేశ్, ఎంఎస్‌ కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తన ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు గత మంగళవారం రాత్రి సంగారెడ్డికి వచ్చి నగేశ్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ముంబై చేరుకున్న రాంనగేశ్ తండ్రి అతడి బెయిల్‌ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.