Begin typing your search above and press return to search.
వైఎస్సార్ ఉన్నప్పుడు గెలిచావ్.. ఇప్పుడు రెండుసార్లు ఓడావెందుకు యాష్కీ?
By: Tupaki Desk | 27 May 2022 11:30 PM GMTకుక్క తోక వంకర అంటారు. ఇదేం పోలిక అంటూ నొసలు చిట్లించొచ్చు. కానీ.. విషయాల్ని లోతుగా చూసినప్పుడు అనిపించే భావన ఇది. ఇంతకీ ఏ విషయంలో అంటారా? టైటిల్ చూసి చదవటం షురూ చేసినప్పటికే అర్థమై ఉంటుంది. అధికారంలో ఉంటే ఒకలా.. పవర్ లేకుండా మరోలా.. ఎప్పుడూ ఏదో ఒకటి పెట్టుకొని ఒకరి మీద ఒకరు విమర్శించుకోవటం.. గ్రూపులు కట్టటం.. వెరసి పార్టీని పలుచన చేయటం కాంగ్రెస్ పార్టీలోనే కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంత దారుణ స్థితిలో ఉన్న పార్టీని ముందు అధికారంలోకి తెచ్చుకోవాలన్న సోయి కంటే కూడా తమ ఉనికిని చాటుకోవాలన్న తపనే నేతల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
మనిషి అన్న తర్వాత ఒక మాట ఎక్కువ తక్కువ మాట్లాడుతుంటారు. మాటల్లో తోపులాంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చే ప్రతి మాటా కరెక్టుగా ఉంటుందా? ఆయన మాటలు ఎందరి మనోభావాల్ని దెబ్బ తీస్తుంటాయి. వాటి గురించి ఎప్పుడైనా.. ఏ ఒక్క రోజైనా టీఆర్ఎస్ పార్టీ నేతలు పల్లెత్తు మాట అన్నారా? అసలు ఆ ఆలోచనను మనసులోకి తీసుకొస్తారా? ఇంకా చెప్పాలంటే.. ఎవరైనా దాని గురించి ప్రశ్నిస్తే.. దిమ్మ తిరిగేలా సమాధానం ఇవ్వటమే కాదు.. ఇలా కూడా కవర్ చేయొచ్చా అన్న ఆశ్చర్యం కలిగేలా చేస్తుంటారు.
అలాంటి తెలివి కాంగ్రెస్ వాళ్లకు ఏమైందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఉద్యమం చేస్తున్న వేళ.. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే.. తెలంగాణలో శాశ్విత అధికారం తమదేనన్న తప్పుడు మాటలు అధినాయకత్వానికి చెప్పిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీ పతనానికి తాము కూడా కారణమన్న విషయాన్నిమర్చిపోవటమే కాదు.. కనీసం వారిలో ఆ బాధ కూడా లేకపోవటం చూసినప్పుడు వారికి వారి పార్టీ మీద కంటే కూడా వారి సొంతలాభమే ముఖ్యమన్న భావన కలుగక మానదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఓటమి.. ఆ తర్వాత పార్టీకి తగిలిన ఎదురుదెబ్బలు ఒక ఎత్తు అయితే.. తర్వాతి కాలంలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకమన్న దుస్థితికి తీసుకొచ్చారు. అలాంటివేళ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఈరోజున రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గౌరవనీయ స్థానంలో ఉండటమే కాదు.. ఎన్నికల్లో తన సత్తా చాటే సమరోత్సాహాన్ని ఇప్పుడిప్పుడే పొందుతుంది. ఇలాంటివేళ.. అధినాయకత్వం ఎంపిక చేసిన అధినేతను పక్కాగా ఫాలో కావాల్సిన అవసరం ఉంది. కానీ.. అందుకు భిన్నంగా తమ సొంతలాభం కోసం పార్టీని దెబ్బ తీసేలా వారి మాటలు ఉండటం చూస్తున్నాం.
ఈ మధ్యనే తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ.. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారు ఏ స్థాయి నేత అయినా సరే వారిపై చర్యలు తప్పవని తేల్చేశారు. ఏదైనా విషయం ఉంటే.. దాన్ని పార్టీలోపల మాట్లాడుకోవాలని.. ఆ విషయాన్ని బయటకు చెప్పి రచ్చ చేసుకోవద్దన్న హితువు కమ్ హెచ్చరిక చేశారు. ఇది జరిగి నెల కూడా కాలేదు.. రేవంత్ ఏదో మాట్లాడారంటూ మాజీ ఎంపీ మధుయాష్కీ రోడ్డు మీదకు వచ్చేయటం.. నోటికి వచ్చినట్లుగామాట్లడేయటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. గాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా చెప్పుకునే మధు యాష్కీ.. తన మాటలతో పార్టీని నష్టమన్న విషయాన్ని ఎందుకు గుర్తించట్లేదు?
రెడ్లకు పగ్గాలు ఇస్తేనే పరా్టీలకు మనుగడ సాధ్యమంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ అన్ని వర్గాల కలయిక అని.. టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్.. సీఎల్పీ నేతగా జానారెడ్డి.. వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ ఉండగా పార్టీ ఎందుకు ఓడిందంటూ ప్రశ్నించిన వైనాన్ని తప్పు పడుతున్నారు. రేవంత్ మాట్లాడిన మాటలు.. ఆయన పాల్గొన్న వేదిక పూర్తిగా భిన్నమన్న విషయాన్ని మర్చిపోకూడదంటున్నారు. కర్ణాటకలో జరిగిన రెడ్డి కుల సమావేశంలో మాట్లాడిన మాటల్ని రాష్ట్రానికి అపాదించటం ఒక తప్పు అయితే..వరుస పెట్టి రెండుసార్లు ఓడిన మధుయాష్కీ ఇప్పటికి తన లోపాన్ని గుర్తించుకోకపోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్ ఉన్నప్పుడు గెలిచిన మధుయాష్కీ.. ఆ తర్వాత ఎందుకు ఓడిపోతున్నారన్న ఆలోచన ఎప్పుడైనా చేశారా?అని ప్రశ్నిస్తున్నారు.
వైఎస్సార్ చేతిలో రాష్ట్ర కాంగ్రెస్ ఉన్నప్పుడు.. ఆయన చెప్పినట్లుగా తూచా తప్పకుండా చేయటం.. లోపల ఆయన మీద ఆగ్రహం ఉన్నా.. బయట పడేందుకు ధైర్యం చాలకపోవటం.. అలా పార్టీని నడిపించినందుకే రెండుసార్లు పార్టీ విజయం సాధించిందన్న వాస్తవాన్ని మధు యాష్కీ లాంటివాళ్లు ఎప్పుడు గుర్తిస్తారు. రేవంత్ రాకముందే.. ఆయన వచ్చాక పార్టీలో పెరిగిన జోష్ ను చూసిన తర్వాతైనా మదుయాష్కీ లాంటి వాళ్లు నోళ్లు మూస్తే మంచిదని.. లేదంటే పార్టీకి జరిగే నష్టం అపారంగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. మరి.. మధుయాష్కీ తన నోటికి తాళం వేసి.. అనవసరమైన మాటల స్థానే మౌనాన్ని ఆశ్రయించటం మంచిదన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.