Begin typing your search above and press return to search.
పెళ్ళీడుపై తోచిన వ్యాఖ్యానాలు
By: Tupaki Desk | 17 Dec 2021 11:30 PM GMTపెళ్ళీడు అన్నది ఇంతే అని చెప్పడానికి ప్రమాణం ఏంటి అంటే ఎవరి బుర్రకు అర్ధం కాని విషయమే. భారతీయ జీవ విధానం సంస్కృతినే తీసుకుంటే ఎనిమిదవ ఏటనే పెళ్ళి చేయమని గతంలో చెప్పేవారు. అదే ఆచారంగా ఉండేది. ఇక రజస్వల అయిన మీదట ఆ పిల్లను అత్తవారింటికి పంపించేవారు. ఎంత తొందరగా పిల్లలను కంటే అంత చక్కని వారసులు వస్తారని నమ్మకం నాడు ఉండేది.
పైగా ఆడపిల్ల ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. అంతే వేగంగా తగ్గిపోతుంది అన్నది కూడా ఒక మాట ఉంది. ఒక ఆడపిల్ల్ల వయసు చిన్నది అయినా తనకంటే పదేళ్లు పెద్ద అయిన మగాడితో సరిసమానంగా ఆలోచనలు చేయగల వివేచన కలిగి ఉంటుందని కూడా చెబుతారు. ఇక మానసికంగా ఆడది చాలా బలవంతురాలు. సరైన ఆహారం తీసుకుంటే ఆమెని మించిన బలవంతురాలు మరొకరు ఉండరని అంటారు.
ఇక జీవన ప్రమాణాలు తీసుకుంటే సగటున ఒక ఆడది మగవారి కంటే ఎక్కువ కాలం జీవిస్తుంది. ఇలా ఆడవారి విషయంలో చాలా ఆసక్తికరమైన విషయాలే ఉన్నాయి. మూఢ నమ్మకాలే అనుకున్నా కూడా పూర్వం విధానంలో ఆడదానికి చాలా గొప్ప రక్షణ ఉండేదని రుజువు అవుతూ వచ్చిన సత్యం. భర్త నుంచి బిడ్డలు, అలా తరాలను పెంచుకుంటూ వారితో అనుబంధం పంచుకుంటూ భారతీయ స్త్రీ మూర్తి సంపూర్ణత్వాన్ని సాధించింది అన్నది చరిత్ర చెప్పిన సత్యం.
ఇక ఆడపిల్ల పెళ్ళీడు వయసు మీద తాజాగా 21 ఏళ్ళుగా నిర్దారిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. దాన్ని చట్టంగా తీసుకురావాలనుకుంటోంది. అయితే దీని మీద అటూ ఇటూ వాదోపవాదాలు వినవస్తున్నాయి. 21 ఏళ్ల దాకా పెళ్ళి చేయవద్దు అనడమేంటని సంప్రదాయవాదులు గర్జిస్తూంటే ఇంకా ఎక్కువ ఏళ్ళు పెట్టినా అభ్యంతరం లేదని అభ్యుదయవాదులు అంటున్నారు. వారు మరో అడుగు ముందుకేసి ఆడపిల్ల పెళ్ళికి చట్టాలు, ఆంక్షలు ఏంటి అని కూడా అంటున్నారు.
అయితే 21 ఏళ్ళు అంటే చాలా ఎక్కువ సమయం అని సంప్రదాయవాదుల వాదనగా ఉంది. ఆడపిల్ల రజస్వల అయిన తరువాత నుంచి శారీరక ఎదుగుదల చాలా వేగంగా జరుతుందని చెబుతున్నారు. అలా ఆమె మరో ఏడెనిమిదేళ్ల పాటు వివాహానికి దూరంగా ఉండడం క్షేమం కాదని కూడా అంటున్న వారు ఉన్నారు. ఇక దేశంలో నానాటికీ పెరుగుతున్న అత్యాచారాలు, దారుణాలకు ఇక తార్కికమైన ముగింపు తీసుకురావాలంటే వివాహ వయసుని ఇంకా తగ్గించాలని కోరే వారూ ఉన్నారు.
తాజాగా ఝార్ఖండ్ కి చెందిన మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి హఫీజుల్ హాసన్ అయితే పెళ్ళీడు మరీ 21 ఏళ్ళు ఏంటని మండిపడుతున్నారు. అమ్మాయిన కనీస వివాహ వయసుని 18 నుంచి పెంచడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. ప్రస్తుత కాలంలో అమ్మాయిల శారీరక పెరుగుదలను కూడా దృష్టిలో పెట్టుకుని పెళ్ళి వయసుని 16 ఏళ్లకు తగ్గించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ఇదే రకమైన అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజుల్లో ఆడపిల్లలు పెద్ద చదువులు చదువుతూ తమ కాళ్ల మీద తాము నిలబడడానికి చూస్తున్నారు. ఈ క్రమంలో పెళ్ళిని వారు పూర్తిగా పక్కన పెడుతున్నారు. ప్రభుత్వం కనీస పెళ్లీడు అంటూ ఆడపిల్లకు 21ని నిర్దారించింది కానీ నిజానికి ఈ దేశంలో సగటు ఆడవాళ్ళ పెళ్ళీడు 30 ఏళ్ళ దాకా ఉందని కూడా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
అంటే ప్రభుత్వం నిబంధన తెచ్చినా తేకపోయినా కూడా చేసుకోకూడదు అనుకున్న వారు అలాగే వైవాహిక జీవితాన్ని వాయిదా వేసుకుంటూ పోతున్నారు. ఈ నేపధ్యంలో ఆరోగ్యకరమైన సమాజం కోసం, మంచి సంతానం కోసం ఆడపిల్లకు 18 ఏళ్ళకు పెళ్ళి మంచిదని స్త్రీల ఆరోగ్యం పట్ల ఆసక్తి ని చూపించేవారు స్త్రీల వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో వివాహం జరిగితేనే సంతానం కూడా సక్రమంగా కలుగుతుంది అని అంటున్నారు. మొత్తానికి కేంద్రం పెళ్ళీడు ని 21కి పెంచుతూ తీసుకున్న నిర్ణయం వివాదాలకు దారితీసేలా ఉందనే మాట వినిపిస్తోంది.