Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌పై వ్యాఖ్య‌లు.. టీడీపీ అదే త‌ప్పు చేస్తోందా?

By:  Tupaki Desk   |   13 Feb 2022 2:30 AM GMT
ఎన్టీఆర్‌పై వ్యాఖ్య‌లు.. టీడీపీ అదే త‌ప్పు చేస్తోందా?
X
పాపులారిటీ వ‌స్తుంద‌ని అంటే.. చాలు.. టీడీపీ నాయ‌కులు పాత‌వి త‌వ్వి మ‌రీ.. ప్ర‌చారంలోకి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉంటున్నారు. గ‌త ఏడాది చంద్ర‌బాబు కుటుంబంపై అసెంబ్లీలో జ‌రిగిన ఘ‌ట‌న త‌ర్వాత‌.. జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌రిగా స్పందించ‌లేదంటూ.. అప్ప‌ట్లో టీడీపీ నాయ‌కులు.. విమ‌ర్శ‌ల‌కు దిగారు. దీనివ‌ల్ల జూనియ‌ర్‌క‌న్నా.. టీడీపీకే ఎక్కువ డ్యామేజీ వ‌చ్చింద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే.. అప్ప‌ట్లో స‌మ‌సిపోయిన ఈ వివాదంపై మ‌రోసారి టీడీపీ నాయ‌కుడు... మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు మ‌రోసారి కామెంట్లు చేశారు.

జూనియ‌ర్ వ‌ల్ల త‌మ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌న్నారు. 2014, 2019లో అస‌లు జూనియ‌ర్ ఏమ‌య్యాడ‌ని ప్ర‌శ్నించారు. తాజాగా ఒక ఆన్‌లైన్ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బొండా ఉమా తీవ్ర‌వ్యాఖ్య‌లే చేశారు. జూనియ‌ర్‌ను అడ్డు పెట్టుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వంశీ, మంత్రి కొడాలి నాని.. ఈ రోజు టీడీపీపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అన్నారు. అయితే.. దీనివ‌ల్ల కొద్ది సేపు బొండా ఉమా వీడియోకు వీవ‌ర్లు పెరిగే అవ‌కాశం అయితే ఉండొచ్చు. కానీ,అంత‌ర్గ‌తంగా చూస్తే.. పార్టీకి ఎన‌లేని ఇబ్బంది మ‌రోసారి ఎదురైంది. పార్టీకి పుంజుకునే స‌మ‌యంలో ఇలాంటి వ్యాఖ్య‌లు అవ‌స‌ర‌మా? అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

2014-19 మ‌ధ్య టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడుకూడా.. నాయ‌కులు యూట్యూబ్ ఛానెళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇచ్చేవారు. ఇక‌, ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయేవారు. అయితే.. అప్ప‌ట్లో వారుచేసిన కామెంట్లు త‌ర్వాత కాలంలో పార్టీ ప‌రాజ‌యానికి దారితీసింద‌ని విశ్లేష‌కులు చెప్పిన విష‌యం తెలిసిందే. బీకాంలో ఫిజిక్స్ అంటూ.. వ్యాఖ్యానించిన జంపింగ్ నేత ఒక‌రు పార్టీ ప‌రువును రోడ్డున ప‌డేసిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా నాయ‌కులు.. చంద్ర‌బాబును ఆకాశానికి ఎత్తేసి.. త‌ర్వాత‌.. కాలంలో పూర్తిగా ప‌డేసిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి.

కేవ‌లం త‌మ‌కు ప్రచారం వ‌స్తుంద‌ని అంటే చాలు.. నాయ‌కులు యూట్యూబా.. ఆ ట్యూబా అనే తేడా లేకుండా .. రెచ్చిపోవ‌డం కామ‌న్‌గా మారింది. ఇది టీడీపీకి మేలు చేయ‌క‌పోగా.. కీడు చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇప్ప‌టికైనా.. నాయ‌కులు మార‌తారా లేదా? అనేది చూడాలి. ఏదేమైనా.. జూనియ‌ర్ విష‌యం పాత‌దై పోయింది.. ఇప్పుడు మ‌ళ్లీ దీనిని తెర‌మీదికి తేవ‌డం అంటే.. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించిన వారి ల‌క్ష్యం ప్ర‌చారం కోరుకోవడ‌మేగా!! అంటున్నారు ప‌రిశీల‌కులు.