Begin typing your search above and press return to search.

ఆమె ఒక్క స‌మీక్ష‌కూ రాలేదు ఎందుకంటే?

By:  Tupaki Desk   |   5 Feb 2022 5:31 AM GMT
ఆమె ఒక్క స‌మీక్ష‌కూ రాలేదు ఎందుకంటే?
X
ఢిల్లీ రాజ‌కీయాల్లో తెలుగింటి కోడ‌లు నిర్మ‌లా సీతారామ‌న్ మ‌న‌కు అన్యాయం చేస్తుంటే, ఆంధ్రావ‌ని రాజ‌కీయాల్లో ఉంటూ కీల‌కం కాలేక,అస‌లు గిరి పుత్రులను ప‌ట్టించుకోక శ్రీ‌కాకుళం కోడ‌లు పుష్ప శ్రీ‌వాణి ఈ ప్రాంతానికి తీర‌ని అన్యాయం చేస్తున్నారు. ఒక‌ప్పుడు ఆమె ఫైర్ బ్రాండ్.. న‌గ‌రి ఎమ్మెల్యే రోజా మాదిరి ప‌నిచేశారు.కానీ ఇప్పుడు ఫుల్ సైలెంట్ అయిపోయారు.ఇకపై ఆమె నుంచి ఉత్త‌మ స‌మ‌ర్థ పాల‌న ఊహించ‌డమే కష్టం.

అంటే రానున్న ఎన్నిక‌ల్లో కురుపాం నియోజ‌క‌వ‌ర్గంపై వైసీపీ ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే! ఎందుకంటే ఆమె గిరిజన సంక్షేమ శాఖ ను కూడా చూస్తున్నారు.అయినానిర్ల‌క్ష్య‌మే ప్ర‌తిసారీ స‌మాధానం అవుతోంది. ఇంకా చెప్పాలంటే ఆమె డిప్యూటీ సీఎం మాత్ర‌మే కాదు ఉత్త‌రాంధ్రకు సుప‌రితురాలు కూడా! ఆ విధంగా ఉంటూ కూడా ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు అన్న‌ది ఉత్త‌రాంధ్ర వాసుల ఆవేద‌న.

డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీ‌వాణి రూటే సెప‌రేటు.ఎందుకంటే ఆమె గిరిజ‌న ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే అయినప్ప‌టికీ వారి కోసం ప‌ట్టించుకోరు అన్న విమ‌ర్శ అయితే బాగానే మోస్తున్నారు. కురుపాం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌ర‌సుగా రెండో సారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఈ శ్రీ‌కాకుళం జిల్లా కోడ‌లు అటుపై ఈ ప్రాంత అభివృద్ధి పై కానీ ఇక్క‌డి గిరిజ‌నం సంక్షేమంపై కానీ దృష్టి సారించిన దాఖ‌లాలు లేవు అన్న విమ‌ర్శ‌లు సుస్ప‌ష్టంగా వినిపిస్తున్నాయి.ముఖ్యంగా ఆమె డిప్యూటీ సీఎం అయిన‌ప్ప‌టి నుంచి ఒక్క‌టంటే ఒక్క ఐటీడీఏ రివ్యూ మీటింగ్ కు కూడా హాజ‌రు కాలేదు.ఆమె అవేవీ ప‌ట్టించుకోవ‌డం లేదు.అంతేకాదు అనేక స‌మ‌స్య‌ల‌తో, నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న సీతంపేటతో స‌హా ఇత‌ర గిరిజ‌న గ్రామాల‌ను ఆదుకోవ‌డం లేదు..అన్న వాద‌న కూడా వినిపిస్తోంది.

నిన్న‌మొన్న‌టి వేళ ఐటీడీఏ రివ్యూ మీటింగ్ జ‌రిగింది. ఈ మీటింగ్ జెడ్పీ చైర్మ‌న్ పిరియా విజ‌య హాజ‌ర‌య్యారు కానీ ప‌క్క‌నే ఉన్న పుష్ప శ్రీ‌వాణి హాజ‌రు కాలేక పోయారు.కురుపాం నుంచి 30 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఊరికి (సీతంపేట‌కు) వ‌చ్చేందుకే ఆమె స‌మ‌యం కేటాయించ‌లేక‌పోతే, గిరిజ‌న ప్రాంతాల అభివృద్ధికి,వారి సంక్షేమానికి ఏం కృషి చేయ‌గ‌ల‌ర‌ని టీడీపీ లీడ‌ర్ కూన ర‌వి ఫైర్ అవుతున్నారు. డిప్యూటీ సీఎం నిర్ల‌క్ష్యంపై టీడీపీతో స‌హా ప‌లు విప‌క్ష పార్టీలు ఆందోళ‌న చేసేందుకు కూడా సిద్ధం అవుతున్నాయి. అధికారంలోకి రాక‌మునుపు ఇంటింటికీ వెళ్లి అంద‌రినీ ప‌ల‌క‌రించిన పుష్ప శ్రీ‌వాణి త‌రువాత మాత్రం అంత‌గా యాక్టివ్ గా లేరు. ఎందుక‌నో సైలెంట్ అయిపోయారు.ఆ రోజు పార్టీ అధినాయ‌క‌త్వం ఏ పిలుపు ఇచ్చినా వెంటేనే స్పందించిన ఆమె ఇవాళ క‌నీసం స‌మీక్షా స‌మావేశాల‌కు కూడా స‌మ‌యం కేటాయించ‌లేక‌పోతున్నార‌న్న వాద‌న‌కు బ‌ల‌మిస్తూ ఆమె ప్ర‌వ‌ర్త‌న ఉంది.