Begin typing your search above and press return to search.

సీఎం పై సోషల్ మీడియా లో వ్యాఖ్యలు.. గుండు కొట్టేశారు

By:  Tupaki Desk   |   24 Dec 2019 5:19 AM GMT
సీఎం పై సోషల్ మీడియా లో వ్యాఖ్యలు.. గుండు కొట్టేశారు
X
సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చాక.. సామాన్యుల కు సైతం మొబైల్ డేటా అందుబాటు లోకి వచ్చాక ఎవరికేం నచ్చితే దానికి తగ్గట్లు రాసేయటం ఈ మధ్యన ఎక్కువైంది. అయితే.. రాజకీయ వర్గాలు ఇలాంటి వాటిని ఏ మాత్రం సహించలేకపోతున్నాయి. సోషల్ మీడియా వచ్చిన తొలినాళ్లలో ఇలాంటి రాతల్ని పెద్దగా పట్టించుకునే వారు కాదు రాజకీయ నేతలు. కానీ..సోషల్ మీడియాలో రాసిన రాతలు వైరల్ గా మారి.. ప్రజల మధ్య హాట్ టాపిక్ గా మారుతుంటే తమ ఇమేజ్ కు జరుగుతున్న డ్యామేజ్ ను అర్థం చేసుకొన్న రాజకీయ నేతలు ఇప్పుడు వార్నింగ్ లు ఇచ్చేస్తూ.. అలాంటి రాతల్ని కంట్రోల్ చేయటం షురూ చేశారు. మరి కొందరు కేసులు పెట్టించి రాసినోళ్లకు చుక్కలు చూపిస్తున్నారు.

చేతి లో మరింత అధికారం ఉంటే ఏకంగా అరెస్టు చేయిస్తున్న ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. కానీ.. వీటన్నింటికి మించి.. ఇప్పటి వరకూ ఎక్కడా లేని రీతిలో మహారాష్ట్రం లో ఒక ఘటన చోటు చేసుకుంది. మహా ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా రాతలు రాశాడన్నకోపంతో ఓ వ్యక్తిపై దాడి చేయటమే కాదు.. గుండు కొట్టించిన ఘటన ముంబయిలోని వడాల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఉదంతం సంచలనంగా మారటమే కాదు.. సేన కార్యకర్తల తీరు అభ్యంతరకరంగా మారింది.

ఇటీవల ఒక కార్యక్రమం లో పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే జామియా మిలియా ఘటనను జలియన్ వాలాబాగ్ తో పోల్చారు. ఈ వ్యాఖ్యల్ని తప్పు పట్టిన హీరామాయి తివారీ అనే వ్యక్తి సీఎం కు వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టారు.

ఇది కాస్తా స్థానికంగా వైరల్ అయ్యింది. అంతే.. మండిపడిన శివ సైనికులు ముప్ఫై మంది వచ్చి ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన వ్యక్తిగా దాడి చేయటమే కాదు.. బలవంతంగా గుండు చేయించారట. ఇదే విషయాన్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నాడు బాధితుడు. ఈ వ్యవహారం హైలెట్ కావటంతో నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు శివ సైనికులు. రాజీ కోసం రాయబారాలు నడుపుతున్నట్లుగా చెబుతున్నారు.

అధికార పక్షంపైన తన కు తోచినట్లుగా ఉద్దవ్ ఠాక్రే సైతం తన అధికార పత్రిక సామ్నాలో ఘాటు వ్యాఖ్యలు చేశారన్నది మర్చిపోకూడదు. అలాంటిది ఆయనే సీఎం అయినప్పుడు.. ఆయన వ్యాఖ్యల్ని విమర్శిస్తే.. దాడి చేసి గుండు కొట్టిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. అధికారం చేతికి వస్తే ఎవరైనా అంతే.. ఇట్టే మారిపోతారన్న దానికి సేన కార్యకర్తల తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు.