Begin typing your search above and press return to search.
కార్మిక శాఖామంత్రిగా పనిచేశావ్...చట్టాల గురించి తెలియదా కేసీఆర్?
By: Tupaki Desk | 18 Oct 2019 1:10 PM GMTతెలంగాణలో గత 14 రోజులుగా కొనసాగుతున్నఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. సమ్మె విషయంలో మెట్టు దిగేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కార్మికులు వాళ్లకు వాళ్లే సమ్మె విరమించాలని, అప్పుడే చర్చలు జరపాలని ఆయన అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు కార్మికులు తమ కార్యాచరణను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వారు జాతీయ సంఘాలతో సైతం జట్టుకడుతున్నారు. తాజాగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వామపక్ష పార్టీ అనుబంధ సీఐటీయూ జాతీయ నేతలు పాల్గొని...ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. కార్మిక శాఖామంత్రిగా పనిచేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చట్టాల గురించి తెలియదా అని నిలదీశారు.
సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షుడు పద్మనాభన్ మీడియాతో మాట్లాడుతూ...కార్మికులు అంతా కలిసి ఆర్టీసీ కార్మికుల కోసం ఉద్యమం చేయడం మంచి పరిణామమని అన్నారు. ``కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేసిన కేసీఆర్‌కు కార్మిక చట్టాల గురించి తెలియదా? ఉద్యమం నుండి వచ్చిన కేసీఆర్ ఆర్టీసీ ఉద్యమాన్ని అణచి వేస్తాను అంటే ఎలా? సెల్ఫ్ డిస్మిస్ అనే పదం రాజ్యాంగంలో లేదు. అయినా...ఆ పేరుతో బెదిరిస్తూ.... బ్రిటిష్ రాజులాగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు. `` అంటూ మండిపడ్డారు. ``తెలంగాణలో నిజాం పాలనలో లేము...రాజ్యాంగం పరమైన దేశంలో ఉన్నాం. సమ్మె చేయడం కార్మికుల హక్కు.100 ఏళ్ల నుంచి ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యమానికి పొలిటికల్ పార్టీలు కలిసి రావడం మంచి పరిణామం. దేశవ్యాప్తంగా తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె కు మద్దతు గా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.`` అని వెల్లడించారు.
ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ...మొండి ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వంలో చలనం లేదని, తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. చర్చలకు పిలవాల్సింది పోయి లీకులతో ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టాలని చూస్తుందని మండిపడ్డారు. కార్మికులు ఎవరూ బయపడవద్దని తాము అండగా ఉంటామన్నారు.