Begin typing your search above and press return to search.
అరవోళ్లని మాయచేయడం అత వీజీ కాదు మోడీ
By: Tupaki Desk | 6 March 2019 5:20 PM GMTఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించడం - సెంటిమెంట్ వర్కవుట్ చేసి ఓట్లు కొట్టేయడం లాంటి పనులు అన్ని పార్టీలు - అన్ని పార్టీల నాయకులు చేస్తూనే ఉంటారు. ఇందుకు ఎవ్వరూ మినహాయింపు కాదు. ఇక ఇలాంటి విషయాల్లో మోదీ నిష్ణాతుడు. ఇన్నాళ్లు సౌత్ ని పెద్దగా పట్టించుకోని మోదీ.. ఎన్నికలు దగ్గకు వచ్చేసరికి అందర్ని ఆకట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఇందులో భాగంగా మొన్నటికి మొన్న విశాఖ రైల్వే జోన్ ఇచ్చాడు. ఆ తర్వాతి రోజు విశాఖ వచ్చి బహిరంగ సభలో మాట్లాడాడు. మనవాళ్లు అయితే.. ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు కానీ తమిళోళ్లు అలక్కాదు. వారికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. అందుకే.. గతంలో మోడీ వచ్చినప్పుడు గోబ్యాక్ మోడీ అనే నినాదాలు చేశారు. బ్లాక్ బెలూన్ల ఎగరవేసి నిరసన తెలిపారు.
జయలలిత మృతిని క్యాష్ చేసుకుని తమిళనాట పాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేసిందని తమిలులకు మోదీ అంటే చాలా కోపం. అందులోనూ కావేరి ఇష్యూ కూడా ఉండనే ఉంది. దీంతో.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాదు రాబోయే రోజుల్లో కూడా బీజేపీ తమిళనాట నిలబడడం అసంభవం. అందుకే తమిళనాట ఎప్పుడూ పొత్తు రాజకీయాలు చేస్తుంటుంది బీజేపీ. ఇక ఇవాళ తమిళనాడు వెళ్లిన మోదీ.. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అన్నింటికి మించి.. తమిళవాళ్ల కోపాన్ని తగ్గించేదుకు చెన్నై రైల్వే స్టేషన్ పేరుని ఎంజీఆర్ పేరుతో మార్చారు. ఇన్ని చేసినా కూడా తమిళ ప్రజలు మోడీని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ కూడా మోదీ గోబ్యాక్ అని నిరసనలు తెలిపారు. వాళ్లు ఆంధ్రులు కాదుకగా.. తెలివితక్కువుగా ఉండటానికి. ఈ విషయం మోదీకి త్వరలోనే అర్థం అవుతుందిలే.