Begin typing your search above and press return to search.

రితేశ్వరి ప్రాణం తీసింది క్యాంపస్సే

By:  Tupaki Desk   |   9 Aug 2015 5:49 AM GMT
రితేశ్వరి ప్రాణం తీసింది క్యాంపస్సే
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రితేశ్వరి ఆత్మహత్యకు దారి తీసిన అంశాలపై.. ఆమె మరణంపై ఏర్పాటు చేసిన కమిటీ ఒక నివేదికను సిద్ధం చేసింది. దీన్ని తాజాగా ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ కు ఇచ్చారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు. ఈ నివేదికలోని అంశాలు చూస్తే..

= సీనియర్ అమ్మాయిలు జూనియర్ అమ్మాయిల ఫోన్ నెంబర్లు తీసుకొని వాటిని సీనియర్ అబ్బాయిలకు ఇస్తుండేవారు.

= క్యాంపస్ లో కులసంఘాల హడావుడి ఎక్కువే.

= బస్సు ఎక్కిన తర్వాత నుంచి కాలేజీకి వెళ్లే వరకూ ర్యాగింగ్ సాగేది.

= సీనియర్ విద్యార్థులకు అర్కిటెక్ట్ ప్రిన్సిపల్ సన్నిహితంగా ఉండేవారు. దీంతో.. వారు హద్దులు మీరి వ్యవహరించేవారు.

= ఎవరైనా జూనియర్ ర్యాంగింగ్ అంశంపై ఫిర్యాదు చేసినా.. ప్రిన్సిపల్ బాబురావు నుంచి స్పందన ఉండేది కాదు.

= ఇంటర్నల్ మార్కుల కారణంగా జూనియర్ విద్యార్థులు ర్యాగింగ్ గురించి చెప్పేందుకు భయపడేవారు.

= క్లాసులు రాత్రివేళలో కూడా సాగేవి.

= రాత్రి 11 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకూ విద్యార్థులు మెలుకువగా ఉండటం మామూలే.

= జూనియర్ విద్యార్థులను వేధించిన ఘటనల్ని షూట్ చేసి వాట్సప్ లో ఉంచేవారు.

= ఫ్రెషర్ డే పార్టీకి అనుమతి లేదు. ఆ పార్టీలో మద్యం సరఫరా కావటమే కాదు.. విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ మద్యం సేవించారు.

= రాత్రిపూట జరిగే క్లాసుల కారణంగా ర్యాగింగ్ హద్దులు దాటేది.

= క్యాంపస్ లో మందు కొట్టటం చాలా కామన్.

= రితేశ్వరి మరణం గురించి మధ్యాహ్నం 12.30 తెలిస్తే.. రాత్రి 8.30 గంటల వరకూ పోలీసులకు సమాచారం అందించలేదు.

= క్యాంపస్ లోకి అవుటర్స్ కూడా బాగానే వచ్చి పోతున్నట్లుగా పలువురు చెబుతున్నారు.