Begin typing your search above and press return to search.
జుట్టు కోసం చూస్తే... పట్టు తగ్గుతుంది!
By: Tupaki Desk | 28 Aug 2015 10:57 PM GMTబిజీ బిజీ లైఫ్, మారుతున్న ఆహారపు అలవాట్లు, కావాల్సినంత కాలుష్యం, విపరీతమైన ఒత్తిడి... కారణం ఏదైనా అవన్నీ కలిపి మగాడి జుట్టుపై పడుతున్నాయి... ఫలితంగా తలపై జుట్టు తగ్గిపోతుంది, చీకట్లో కూడా మెరిసే బట్టతల మిగులుతుంది. దీన్ని తగ్గించుకోవడానికి మగాడు చేయని ప్రయత్నం ఉండదు! ఉన్న నాలుగు వెంట్రుకలను బోడి గుండు పై కప్పి కొంత కాలం కవర్ చేసే ప్రయత్నం చేసినా.. అది ఇంట్లో నుండి బయటకు రాగానే దాని ప్లేస్ లోకి అది వెళ్లిపోతుంది. ఈ క్రమంలో నెత్తిమీద జుట్టు కాపాడుకోవడానికి, మరలా తెచ్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు!
అయితే ప్రకటనలు చూసి పరుగెత్తి రకరకాల ట్రీట్ మెంట్స్ తీసుకుంటే ఊడిపోయిన వెంట్రుకలు తిరిగి రావడం సంగతి దేవుడెరుగు కానీ... అసలుకే మోసం వస్తుందంటున్నారు బోస్టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. జుట్టు పెరగడానికని, ఊడిపోకుండా ఉండటానికని వాడే మెడిసిన్స్ లో ఫినాస్టెరాయిడ్, డూటా స్టెరాయిడ్ లు ఎక్కువ మోతాదులో ఉంటాయని వీటి వల్ల లైంగిక సామర్ధ్యం దెబ్బ తింటుందని చెబుతున్నారు. జాగ్రత్త పురుషులూ... ఊడిపోయిన జుట్టు కోసం పట్టు తగ్గించుకుంటారా?