Begin typing your search above and press return to search.

వైరల్ : అన్నా.. ఇదేం పెంచుడే?... జ‌గ‌న‌న్న‌కు సామాన్యుడి లేఖ‌

By:  Tupaki Desk   |   31 March 2022 4:31 AM GMT
వైరల్ : అన్నా.. ఇదేం పెంచుడే?... జ‌గ‌న‌న్న‌కు సామాన్యుడి లేఖ‌
X
`జ‌గ‌న‌న్నా.. ఇదేం గుంజుడే!` అంటూ.. సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. ఏపీలో తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలు... ప్ర‌భుత్వం వేస్తున్న ప‌న్నులు... పెరుగుతున్న ధ‌ర‌లు.. ఇలా.. అనేక అంశాల‌పై సామాన్యు లు.. సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందిస్తున్నారు.

``జ‌గ‌న‌న్నా.. ఇదేం గుంజుడే! నువ్వొస్తే.. ధ‌ర‌లు త‌గ్గిస్తానంటివి. నువ్వొస్తే.. పేద‌ల ఇళ్లు క‌ళ‌క‌ళ‌లాడేలా చేస్తానంటివి. మ‌రి ఇప్పుడిదేందే.. ఇలా చేస్తివి! పేద‌లకు సినిమా దూరం కాకూడ‌దంటూ.. సినిమా ఓళ్ల‌తో లొల్లి పెట్టుకుని మ‌రీ.. ధ‌ర‌లు త‌గ్గిస్త‌వి. మేమేమో.. మా జ‌గ‌నన్న ఏంటో మాగురించి ఇంత క‌ష్ట ప‌డుతున్నా డ‌ని అనుకున్నాం. మ‌రి ఇప్పుడేమో.. క‌రెంటు చార్జీలు పెంచి గూప్ప‌గ‌లగొట్టుడెందుకే! ఇదేం పాల‌నే జ‌గ‌న‌న్నా!! సినిమా చూపిస్త‌వు కానీ.. క‌రెంటు ఇవ్వ‌వా? కరెంటు చార్జీలు పెంచి.. మాకు రొద‌పుట్టిస్తావే!!`` అని సీమ ప్రాంతాల‌కు చెందిన ప్ర‌జ‌ల ఆవేద‌న ఇలా ఉంది.

``ఇదేం పాల‌న సార్‌! చెత్త ప‌న్ను అన్నారు. ఇంటికి ఓటీ ఎస్ అన్నారు. న‌డిస్తే. ప‌న్ను కూర్చుంటే ప‌న్ను.. అంటూ.. మా ప్రాణం తీస్తున్నారే. ఇప్పుడు క‌రెంటు చార్జీ ల‌పెంపా.? సినిమా టికెట్ల ధ‌ర‌లు పెంచితే.. పేద‌ల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని.. క‌న్నీరు పెట్టుకున్న మీరేనా.. ఇప్పుడు యూనిట్ రూపాయి చొప్పు న పెంచింది? చెత్తపై ప‌న్ను క‌డుతున్నాం.. పెట్రోలు ధ‌ర‌లు బాదేస్తున్నా.. భ‌రిస్తున్నాం.. గ్యాస్ బండ‌ల పై.. బాదేస్తున్నా.. మోసేస్తున్నాం.. కానీ, మీరు ఈ డ‌బ్బులు ఏం చేస్తున్నారు? ఏదేమైనా.. ఇదేం బాలేదు సార్‌!!`` ఇది మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ఆక్రంద‌న‌.

గ్రామీణ స్థాయిలోనూ.. ప్ర‌జ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో రోజుకు 100 రూపాయ‌లు ఉంటే.. బ‌తికేసిన‌..సామాన్యుడు. ఇప్పుడు.. వంద‌తో నెట్టుకు వ‌చ్చే ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఇక్క‌డ గ్రామీణ ప్రాంతాల్లో ఒక చిత్ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో పెట్రోలు, గ్యాస్ ధ‌ర‌లు పెరిగిన‌ప్పుడు.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న‌లో ఆ భారం ఎంతో కొంత త‌గ్గించేందుకు త‌న ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని.. ఆయ‌న చెప్పిన సంఘ‌ట‌న‌ను వారు గుర్తుచేసుకుంటున్నారు.2005లో గ్యాస్ ధ‌ర రూ.25 పెరిగిన‌ప్పుడు.. ఆ భారం మొత్తం.. రాష్ట్ర ప్ర‌భుత్వమే భ‌రిస్తుంద‌ని చెప్పారు. మ‌రి.. ఆయ‌న కొడుకుగా ఏపీలో రాజ‌న్న రాజ్యం తెస్తాన‌న్న జ‌గ‌న్‌.. ఇప్పుడు... ప్ర‌జ‌ల‌పై మ‌రింత భారం మోపేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డంపై ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.