Begin typing your search above and press return to search.
ఆ డబ్బులు ఏమైనా మీ ఇంట్లోవా బాబు?
By: Tupaki Desk | 22 Jun 2017 4:35 PM GMTఏపీ ముఖమ్యంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరమైన చర్చకు ఎంత దారితీశాయో అంతే రీతిలో వివాదానికి సైతం మారిపోయాయి. ప్రస్తుతం అనుకోకుండా వచ్చిపడిన ఉప ఎన్నికల్లో పార్టీ విజయంపై నీలినీడలు కమ్ముకోవడం కావచ్చు...మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్న వ్యతిరేకత పవనాలు కారణం అయి ఉండవచ్చు కానీ సీఎం చంద్రబాబు చిందులు తొక్కారు. నంద్యాల పర్యటనలో భాగంగా స్థానికులను ఒకింత ప్రలోభ పెడుతూనే మరోవైపు బెదిరింపులకు దిగారు.
పార్టీ కార్యక్రమంలో భాగంగా నేతలతో సమావేశం అనంతరం అక్కడికి వచ్చిన స్థానికులతో బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అనుభవిస్తూ టీడీపీకి ఓటేయకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు. ``నేను ఇచ్చిన పింఛను తీసుకుంటున్నారు...నేను వేసిన రోడ్లపై నడుస్తున్నారు... నేను వేసిన వీధి దీపాల వెలుగులో ముందుకెళ్తున్నారు.. అలాంటిది నాకు ఓటేయకుంటే అడగకుండా ఎలా ఉంటాను?` అంటూ నిలదీశారు. అయితే బాబు కామెంట్లను చూసిన వారు ఓటు కోసం నోటు ప్రలోభాలు చూపడం కన్నా అధికారం చేతిలో ఉంది కదా అని బెదిరింపులకు దిగారని అంటున్నారు.
మరోవైపు బాబు తాను ఓ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా కాకుండా ఏదో ఒక సంస్థకు సీఈఓగా లేదంటో దానదర్మం చేస్తున్న వ్యక్తిగా అప్పనంగా జేబులో నుంచి సొమ్ములు ఇస్తున్నట్లు వ్యవహరించారని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో పాలకుడిగా సంక్షేమ, అభివృద్ధి నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడం కనీస బాధ్యత అనే విషయాన్ని మర్చిపోయి తన ఇంట్లో నుంచి డబ్బులు ఇచ్చినట్లుగా భావిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. జేబులోని సొమ్ము, హెరిటేజ్ కు సంబంధించిన ఆస్తులనో ఇచ్చినట్లుగా బాబు తీరు ఉందని కొందరు మండిపడుతున్నారు. ఇంతకీ ఈ కామెంట్లకు బాబు ఏమని సమాధానం ఇస్తారో మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/