Begin typing your search above and press return to search.

ఆయన కాశ్మీర్ ను పాక్ లో కలిపేస్తారేమో

By:  Tupaki Desk   |   24 Aug 2015 5:30 PM GMT
ఆయన కాశ్మీర్ ను పాక్ లో కలిపేస్తారేమో
X
వివాదాస్పద కేసుల్ని టేకప్ చేయటమే కాదు.. వివాదాస్పద అంశాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయటం సీనియర్ న్యాయవాది.. తన క్లయింట్ల దగ్గర గంటలకు చొప్పున ఫీజు వసూలు చేసే రామ్ జెఠ్మాలానీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాక్ కుయుక్తులు సామాన్యలకు కూడా అర్థం అవుతున్నా.. రామ్ జెఠ్మాలనీకి మాత్రం అర్థం కానట్లుగా చిత్రంగా మాట్లాడుతున్నారు. భారత్ తో చర్చల సందర్భంగా పాక్ అధికారులు.. కాశ్మీర్ కు చెందిన కొందరు వేర్పాటు నేతలతో భేటీ కావాలని అనుకోవటం.. దానికి కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేయటం.. తదనంతర పరిణామాలతో రెండు దేశాల మధ్య జరగాల్సిన భేటీ రద్దు కావటం తెలిసిందే.

ఈ సందర్భంగా హరియత్ నేతల్ని వేర్పాటువాదులుగా పిలవటాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అందరూ వారిని అపార్థం చేసుకుంటున్నారని.. ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అటు అధికారపక్షంలోని వారు.. రాజకీయ నాయకులు కాశ్మీర్ నాయకుల్ని వేర్పాటు వాదులుగా ముద్ర వేశారని ఆరోపించిన జెఠ్మలానీ.. పాక్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రద్దు కావటంపై అసంతృప్తి వ్యక్తం చేశరు.

పాలకుల్లో చాలామందికి అంతర్జాతీయ చట్టాల గురించి కనీస అవగాహన లేదని చెప్పిన ఈ పెద్దమనిషికి సామాన్యమైన ప్రశ్నలకు సూటి సమధానాలు చెబితే బాగుంటుంది.

1. భారత్.. పాక్ దేశాల మధ్య సంబంధాలు సరిగా లేని సమయంలో.. ముందు రెండు దేశాల మధ్య విశ్వాసం పెరిగే అంశాల మీద పాక్ ఎందుకు దృష్టి సారించటం లేదు?

2. భారత్ తో చర్చలు అన్న వెంటనే.. కాశ్మీర్ అంశాన్ని చర్చల్లోకి చేర్చాలనటం పాక్ కుయుక్తికి నిదర్శనం కాదా?

3. హరియత్ నేతల్ని వేర్పాటు వాదులు అనొద్దంటున్నారు సరే.. వారిలో ఏ ఒక్కరితో నైనా పదినిమిషాలు మాట్లాడితే.. వారేం కోరుకుంటున్నారో అర్థం అవుతుంది. అలాంటప్పుడు వారిని వేర్పాటు వాదులుగా అనటంలో తప్పేంది?

4. హరియత్ నేతల్లోని చాలామంది తాము భారత్ లో భాగం కానట్లుగా.. భారత్ తమ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న ఆక్రమణదారుగా వ్యవహరిస్తారు. మరి అంటి వైఖరిని స్వాగతిద్దామా?

5. భారత్ తో సంబంధాల పునరుద్ధరణకు భారత ప్రభుత్వంతో చర్చలు అవసరం కానీ.. కాశ్మీర్ లోని కొన్ని గ్రూపుల నాయకులతో పాక్ అధికారులకు పనేంటి?

6. జెఠ్మాలానీ దేశాన్ని ముక్కలు చేయటాన్ని సమర్థించాలని అనుకుంటున్నారా?

7. ఇప్పటికే పోగొట్టుకున్న కాశ్మీర్ గురించి.. ఆలోచించటం మానేసి.. ఉన్న కాశ్మీర్ ఏం చేయాలనుకుంటున్నారు?

8. అంతర్జాతీయ చట్టాల గరించి నేతలకు అవగాహన లేదంటున్నారు. ఆత్మసాక్షిగా తాను వాదించే కేసులు ఎన్ని చట్టవ్యతిరేమైనవన్న విషయం జెఠ్మాలానీకి తెలీవా?

9. తన వృత్తిని నిర్వహించటంలో భాగంగా.. నిజాన్ని తొక్కిపట్టి.. తన తెలివితేటలతో చట్టంలోని సెక్షన్ల చిక్కులతో నిజంగా నిరూపించే జెఠ్మాలనీ మొదట తానో భారతపౌరుడినని గుర్తిస్తే బాగుంటుందేమో. అంతర్జాతీయ చట్టాల్ని పక్కన పెట్టి.. ఒక భారతీయుడిగా రాంజెఠ్మాలనీ ఆలోచించరా?