Begin typing your search above and press return to search.

ఐదు రాష్ర్టాల్లో ఇదొక్క‌టే కామ‌న్ పాయింట్‌

By:  Tupaki Desk   |   11 March 2017 10:08 AM GMT
ఐదు రాష్ర్టాల్లో ఇదొక్క‌టే కామ‌న్ పాయింట్‌
X
దేశ‌వ్యాప్తంగా ఆసక్తిని సృష్టించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో ఒక పోలిక స్పష్టంగా కనిపిస్తోంది. అదే అన్ని రాష్ట్రాలలోనూ ప్రజలు అధకారంలో ఉన్న పార్టీని తిరస్కరించడం. ఇది ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో పెద్ద రాష్ట్రమైన యూపీ మొద‌లుకొని చిన్న రాష్ట్రమైన గోవా వ‌ర‌కు వ‌ర్తిస్తోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అధికార స‌మాజ్‌వాదీ పార్టీ ప్రజలు తిరస్కరించారు. అంతేకాదు ఇన్నాళ్లు ఏ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌ని విధంగా సాగిన ఓట్ల స‌రళి ఈ ద‌ఫా ఒకే పార్టీకి మెజార్టీ ఇచ్చింది. దాదాపు పాతికేళ్ల తరువాత ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టారు. యూపీలో ఒక పార్టీకి మూడొందల పై చిలుకు స్థానాలు రావడం దాదాపు పాతికేళ్ల తరువాత ఇదే ప్రథమం.

మ‌రో కీల‌క రాష్ట్రమైన‌ పంజాబ్ లో అధికార అకాలీదళ్ కు జనం గుణపాఠం చెప్పి మూడో స్థానం కట్టబెట్టారు. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీకి బంప‌ర్ మెజార్టీ క‌ట్ట‌బెట్టారు. ఇక్క‌డ అధికారంలోకి వ‌స్తామ‌ని క‌ల‌లుక‌న్న కేజ్రీకి సైతం షాక్ ఇచ్చారు. ఇక ఉత్తరాఖండ్ లోనూ అధికార కాంగ్రెస్ కు పార్టీకి శృంగభంగం తప్పలేదు. ప్ర‌తిప‌క్ష‌మైన బీజేపీ ఇక్క‌డ సీఎం పీఠం అధిరోహించే స్థాయి సీట్లు సంపాదించింది. గోవాలోనూ బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు. మణిపూర్ లో అధికార కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మొత్తంగా అన్ని రాష్ర్టాల్లోనూ ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/