Begin typing your search above and press return to search.
బొత్స మీరు నిరూపిస్తే.. పుట్టింటోళ్లు ఇచ్చిన మూడున్నర ఎకరాలిచ్చేస్తా
By: Tupaki Desk | 27 Aug 2019 8:48 AM GMTఏపీ మంత్రి బొత్స సత్యానారాయణకు భారీ సవాల్ ఒకటి ఎదురైంది. ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతికి వరద ముప్పు ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాగా అమరావతి ప్రాంతానికి చెందిన సామాన్య మహిళ ఒకరు భారీ సవాల్ విసిరారు. రాజధాని మునుగుతుందని నిరూపిస్తే.. తనకు తన పుట్టింటోళ్లు ఇచ్చిన మూడున్నర ఎకరాల పొలాన్ని బొత్స సత్యనారాయణకు రాసిచ్చేస్తానని సవాలు విసిరారు.
బొత్సకు అంత బాధ్యతే ఉంటే.. రాజధాని ఏర్పాటు వేళలో.. ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఆమె ప్రశ్నించారు. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో దిగువన ఉన్న నదీ జలాల్లోకి భారీ ఎత్తున వరద నీరు చేరుకుంది. దీన్ని సముద్రంలోకి విడిచి క్రమంలో దిగువ ప్రాంతాలు ముంపునకు గురి అవుతాయని.. అందులో భాగంగా అమరావతి సైతం ముంపు ప్రమాదం పొంచి ఉన్నట్లుగా వాదనలు తెర మీదకు వస్తున్నాయి. ఇదే విషయాన్ని మంత్రి బొత్స విలేకరులతో మాట్లాడుతూ.. పరోక్షంగా హెచ్చరించారు. దీనిపై స్పందించిన ఒక మహిళ భారీ సవాల్ ను విసరటం.. అది కాస్తా టీవీల్లో రావటంతో ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. మరి.. దీనిపై బొత్స ఎలా రియాక్ట్ అవుతారో?