Begin typing your search above and press return to search.
ఆ ప్రోగ్రామ్‌తో ఏపీ పేరు మార్మోగాలి
By: Tupaki Desk | 4 April 2015 5:39 PM GMTతెలుగు నేల మీద జాతీయ.. అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదిక అంటే.. హైదరాబాదే గుర్తుకు వస్తుంది.రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో కొత్త వేదికను వెతుక్కోవాల్సిన పరిస్థితి. హైదరాబాద్ స్థాయిలో వసతులున్న ప్రాంతం ఏపీలో ఏదీ లేని నేపథ్యంలో.. పెద్ద పెద్ద సమావేశాలు.. కార్యక్రమాలు హైదరాబాద్‌లో తప్పించి వేరొక చోట సాధ్యం కాదన్న అభిప్రాయం ఉంది.
కానీ.. అలాంటి వాదనల్లో నిజం లేదని తేల్చేస్తూ.. ఏపీ సర్కారు తాజాగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఏప్రిల్ 8..9..10 తేదీల్లో కామన్ వెల్త్ పార్లమెంటరీ సమావేశాలు నిర్వహించనన్నారు. ఈ కార్యక్రమానికి పది దేశాల నుంచి ప్రతినిధులతో పాటు.. దేశంలోని 20రాష్ట్రాల నుంచి స్పీకర్లు రానున్నారు.
మొత్తం 200 మంది వరకూ హాజరయ్యే ఈ కార్యక్రమంలో చట్టసభలు.. మీడియా తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించటం ద్వారా.. పెద్దపెద్ద కార్యక్రమాలను నిర్వహించే సత్తా ఏపీకి ఉందని.. అందుకు విశాఖ ఉన్న విషయాన్ని తాజా కార్యక్రమం నిరూపిస్తుందంటున్నారు. సీమాంధ్రులకు అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది?