Begin typing your search above and press return to search.
అప్పాయింట్‌మెంట్ ఇస్తే.. అడిగేద్దాం.. కమ్యూనిస్టులు రెడీ కామ్రేడ్!
By: Tupaki Desk | 3 Dec 2022 3:30 PM GMTతెలంగాణలో నిన్న మొన్నటి వరకు బెరుకు బెరుకుగా అడుగులు వేసిన కమ్యూనిస్టులు, ఇప్పుడు ఛాతీ బిగించి మరీ నడుస్తున్నారు. దీనికి కారణం అతిపెద్ద అధికార పార్టీని మునుగోడులో గద్దెనెక్కించామనే ధైర్యం. అయితే, ఇది వీరు చెప్పుకొంటున్నారు. అధికార పార్టీ సైడ్ నుంచి ఇప్పటి వరకు ఆశించిన కాంప్లిమెంటు, ఆశించిన నాయకుడి నుంచి రాకపోవడం గమనార్హం. అయినా.. కమ్యూనిస్టులు వాటి కోసం ఎదురు చూడడం లేదు. తాము చేసుకుంటున్న క్లయిములతో కేసీఆర్‌కు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అందుకే.. ఇటీవల ముగిసన మునుగోడు విజయం సంబరాల వేడి చల్లారకముందే, తెలంగాణ ఉద్యమ సాధకుడిని కలిసి.. తమ కోరికలు నెరవేర్చుకునే పనిలో పడ్డారు. అయితే, ఎటొచ్చీ మధ్యలో అప్పాయింట్‌మెంటే దక్కడం లేదట. చాలా సైలెంట్‌గా కామ్రెడ్లు కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే, ఏ అర్ధరాత్రో.. అపరాత్రో ముందస్తు అని మెల్లగా ప్రకటిస్తే తమ పరిస్తితి ఏంటి? అందుకే దీపం ఉండగానే మునుగోడు వేడి సడలిపోకముందే తమ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని కామ్రేడ్లు తలపోస్తున్నారు.
కానీ, కేసీఆర్ లాంటి ఉక్కు పిండాలకు కామ్రేడ్లు ఎంత? అనుకున్నారో ఏమో.. ఆయన ఉలుకుపలుకు లేకుండా, ఎక్కడున్నారో కూడా చెప్పకుండా కమ్యూనిస్టులకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నారు. సరే, పోనీ.. కేసీఆర్ అప్పాయింట్‌మెంట్ ఇచ్చారనే అనుకోండి.. కమ్యూనిస్టులు ఏం చేస్తారు? అంటే.. వెంటనే ఆయనను నాలుగు సీట్లడిగి.. మూడు కన్ఫర్మ్ చేసుకుని రెండు చోట్ల గెలిచేయాలనేది వారి ప్లానట!! చిత్రంగా ఉందా.. కానీ, ఇది పచ్చి నిజం.. కమ్యూనిస్టు దిగ్గజాలే ఈ విషయాన్ని చెబుతున్నాయి.
మరి ఎక్కడెక్కడ అడుగుతారు? అంటే, కమ్యూనిస్టులకు కంచుకోట వంటి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఈ నాలుగు సీట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఒకటి మిర్యాలగూడ, రెండు మునుగోడు, మూడు దేవరకొండ, నాలుగు నాగార్జున సాగర్. ఈ నాలుగు స్థానాల్లో మూడు కేటాయించాలనేది కమ్యూనిస్టుల కోరిక.
ఇవి కాకుండా.. ఖమ్మం పార్లమెంటు సీటు, ఇదే ఉమ్మడి జిల్లాలో మరో మూడు అసెంబ్లీ స్తానాలపైనా కమ్యూనిస్టుల చూపు ఉంది. మరీ ఇంత తొందరా? అని అనమాకండి.. ఎందుకంటే.. కేసీఆర్ సార్‌కి ఆగ్రహం వచ్చినా.. అనుగ్రహం వచ్చినా పట్టలేం కదా!! అందుకే.. ఈ అనుగ్రహించే సమయంలోనే ప్రసన్నం చేసుకుని పట్టేయాలన్నది కామ్రేడ్ల ముందు చూపు. కానీ, ఎటొచ్చీ అప్పాయింట్‌మెంటు దొరికితేనా? కేసీఆర్ చిక్కితేనా? ఇదీ.. సంగతి!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.