Begin typing your search above and press return to search.
టీయారెస్ లో కామ్రెడ్స్ చిచ్చు పెట్టేశారా.. ?
By: Tupaki Desk | 10 Nov 2022 2:30 AM GMTటీయారెస్ పార్టీకి అసెంబ్లీలో వందకు దాటి ఎమ్మెల్యేల బలం ఉంది. సొంతంగా టీయారెస్ 88 సీట్లకు పైగా గెలుచుకుంటే మరో 12 మంది దాకా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరారు. వచ్చే ఎన్నికల్లో దాదాపుగా సిట్టింగులు అందరికీ టికెట్ ఇస్తామని కేసీయార్ ఆ మధ్య ప్రకటించారు. దాంతో అంతా ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ఆ తరువాత మునుగోడు ఉప ఎన్నిక వచ్చిపడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఎన్నికలు తెచ్చారు.
ఈ పరిణామాలతో అలెర్ట్ అయిన టీయారెస్ అప్పటిదాక కేవలం మజ్లీస్ తోనే ఉన్న పొత్తుని విస్తరించుకుంది. నల్గొండ జిల్లాలో ప్రత్యేకించి మునుగోడులో కామ్రేడ్స్ కి బలం చూసుకుని వారితో పొత్తుకు సై అన్నారు కేసీయార్. ఆ విధంగా టీయారెస్ మునుగోడు విజయంలో కామ్రేడ్స్ కీలకమైన పాత్ర పోషించారు.
ఈ విజయానందంలో తమ పొత్తులు కేవలం ఉప ఎన్నికకే పరిమితం కాదని, వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగుతాయని టీయారెస్ పెద్దలు చెప్పుకొచ్చారు. దాంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో రాయి పడింది. సిట్తింగులు అందరికీ టికెట్లు అని ఆ మధ్య చెప్పిన కేసీయార్ ఇపుడు ఎవరికి కోత పెట్టి కామ్రేడ్స్ కి సీట్లు సర్దుతారు అన్నదే వారికి టెన్షన్ గా ఉందిట.
కామ్రేడ్స్ కి ఉమ్మడి నల్గొండ, ఖమ్మంతో పాటు కొన్ని జిల్లాలో బలం ఉంది. గతంలో వారు అక్కడ నుంచి పలు మార్లు గెలిచారు. దాంతో సీపీఐ, సీపీఎం పార్టీలు రెండూ కలసి కనీసంగా పాతిక నుంచి ముప్పయి సీట్ల దాకా కోరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వాటిని సగానికి సగం చేసిన టీయారెస్ పదిహేను సీట్ల దాకా పొత్తులలో భాగంగా వారికి సమర్పించుకోకతప్పేట్లు లేదు.
అవి కూడా సిట్టింగు టీయారెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోటనే ఉన్నాయని చెబుతున్నారు. దాంతో ఎవరి సీటుకు ఎసరు వస్తుంది అన్న బాధ గులాబీ పార్టీ వారిది అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుత సీపీఐ రాష్ట్ర కార్యదర్శి 2009 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి గెలిచారు. రేపటి ఎన్నికల్లో ఆయన ఆ సీటును కచ్చితంగా కోరుతారు అని అంటున్నారు. దాంతో సిట్టింగ్ టీయారెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సీటుకు గండం ఏర్పడినట్లే అని లెక్కలేస్తున్నారు. ఈ సీటు విషయంలో ఆశలు పెంచుకున్న మరో టీయారెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా షాక్ తగులుతోంది అంటున్నారు.
అదే విధంగా ఖమ్మంలో తమ్మినేని వీరభద్రం సీపీఎం నుంచి మాజీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయనకు కూడా టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన ఖమ్మం ఎంపీ సీటుతో పాటు ఎమ్మెల్యే సీటు మీద కూడా కన్నేశారని టాక్. దీంతో ఖమ్మం అసెంబ్లీకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పువ్వాడ అజయ్ కి సీటు సమస్య ఏర్పడుతోంది అంటున్నారు.
అలాగే ఖమ్మం ఎంపీగా ప్రస్తుతం ఉన్న నామా నాగేశ్వరావుకి కూడా సీపీఎం దెబ్బ పడుతుంది అంటున్నారు. ఇక మునుగోడు కి కొత్తగా గెలిచిన ప్రభాకరరెడ్డి కి కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమే అంటున్నారు. ఈ సీటు 2023 ఎన్నికల్లో సీపీఐ కోరుకుంటోందని చెబుతున్నారు. ఇలా చాలా సీట్లకు కామ్రేడ్స్ ఎసరుపెడతారు అని తెలియడంతో టీయారెస్ లో ఎమ్మెల్యేలు పరేషాన్ అవుతున్నారని టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.