Begin typing your search above and press return to search.

రూటు మార్చిన కమ్యూనిస్టులు

By:  Tupaki Desk   |   7 Sep 2021 9:33 AM GMT
రూటు మార్చిన కమ్యూనిస్టులు
X
ప్రజా పోరాటాల్లో నిత్యం ముందుండే కమ్యూనిస్టులు ప్రభుత్వ ఏర్పాటులో ఒకప్పుడు కీలకంగా ఉండే వారు. యూపీఏ-1 సర్కారు వరకు ఒకటి, రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా ప్రస్తుతం కేరళలో మాత్రమే కొనసాగుతోంది. అయితే రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల ప్రభావం లేకున్నా కేంద్రంలో మాత్రం సీనియర్ నాయకులు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. యూపీఏ-1 సర్కారులో లెప్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించినప్పుడు ఇతర పార్టీలను కలుపుకునేందుకు అప్పట్లో కాంగ్రెస్ కొంచెం కష్టపడాల్సి వచ్చింది. కానీ రాను రాను ఈ పార్టీకి నాయకులు కరువయ్యాకు. తాజాగా ఏపీలో మరోసారి ఎర్ర జెండా రెపరెపలాండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీ, తెలంగాణలో సీపీఎం ప్రభావం కొంత వరకు ఉన్నా సీపీఐ ఉనికి పర్వాలేదనిపిస్తుంది. కార్మికుల పక్షాన పోరాడే సీపీఐ కార్మికులున్న ప్రతీచోట ఎర్రజెండా కనిపిస్తుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో సీపీఐ కీలకంగా నిలించి తెలంగాణ కోసం ముందుండి పోరాడింది. అయితే ఆ తరువాత వచ్చిన సాంప్రదాయ పార్టీల తాకిడికి తట్టుకోలేకపోయాయి. మిగతా పార్టీల ఆఫర్లతో సీపీఐలో ఉన్న ముఖ్య నాయకులంతా వలస వెళ్లారు. దీంతో సీపీఐ కి నాయకుల కొరత తీవ్రంగా ఏర్పడింది. అయితే పోరాట పటిమ ఉన్నవాళ్లు మాత్రం పార్టీని నమ్మొకొని ఉన్నారు.

ఇక ఏపీలో ఈ పార్టీ అంతంతమాత్రంగానే ఉంది. 2018లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కమ్యూనిస్టులు వెలుగులోకి వచ్చారు. అయితే వీరి ప్రభావం ఇతర పార్టీలపై ఏమాత్రం పడలేదు. రాయలసీమలో కొంచెం పట్టున్నా అక్కడ కూడా ఒక్క సీటు గెలవలేదు. దీంతో మరోసారి ఆ పార్టీలను పట్టించుకునేవారు లేకుండా పోయింది.

తాజాగా ఏపీలో సీపీఐ ని బలోపేతం చేసేందుకు జాతీయ నాయకత్వం సైతం దృష్టి సారిస్తోంది. జనాల్లో పట్టు పెంచుకునేందుకు ఇప్పటికే అమరావతి రాజధాని లాంటి పోరాటంలో ఆ పార్టీ నాయకులు తమ ఉనికిని చాటుకున్నారు. ఇక అప్పుడప్పుడు జరిగే పోరాటాల్లోనూ పాల్గొంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల వరకైనా పార్టీ మైలేజ్ పెంచాలని రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తోంది. ఇందుకు జాతీయ నాయకత్వం సపోర్టు కావాలని కోరడంతో వారు కూడా అందుకు ఓకే చెప్పారు.

ఇందులో భాగంగా విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలు నిర్వహించాలని అనుకుంటున్నారు. కరోనా అడ్డంకులు లేకపోతే వచ్చే అక్టోబర్ 2 నుంచి 4 వరకు పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ఇక్కడే ఏర్పాటు చేసి అందులో సభలు నిర్వహించే తేదీలను ప్రకటించనున్నారు. సీపీఐ జాతీయ సభలను నిర్వహించడం ద్వారా ఏపీపై మిగతా పార్టీల దృష్టిపడుతుంది. దీంతో ప్రజల్లోనూ పార్టీ బలాబలగాలు అర్థమైపోతాయని నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళనలో ఏపీనాయకులు సైతం తమ భాగస్వామ్యం పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా వచ్చే ఎన్నికల్లో తమ ప్రాబల్యం చాటుకునేలా ప్రజల తరుపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఈ ఆందోలనలు అయ్యాక.. ఆంధ్రాలో నిర్వహించాల్సిన సభలు, అందులో ప్రస్తావించల్సి విషయాలపై చర్చించనున్నారు.

ఇదిలా ఉండగా పార్లమెంట్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఈనెల 25 నాటికి 25 ఏళ్లు అవుతుంది. దీంతో ఈ సందర్భాన్ని మహిళా రిజర్వేషన్ డే పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా తెలిపారు. అయితే ప్రస్తుతం ఇతర పార్టీల మధ్యే తీవ్ర పోటీ ఉంది. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టుల భావాలు, ప్రసంగాలు ప్రజలను ఎంత మేరకు ప్రభావం చూపుతాయో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.