Begin typing your search above and press return to search.
సింధు విజేతే కాదు..ఒక బ్రాండ్ ఇప్పుడు!
By: Tupaki Desk | 26 Aug 2016 12:53 PM GMTఒక్క రజతం.. ఆమె జీవితాన్నే మార్చేసింది. భారత తరఫున రజితం సాధించి రికార్డు సృష్టించింది సింధు. దాంతో ఆమె జీవితం అనూహ్యంగా మారిపోయింది. నిన్నమొన్నటి వరకూ వర్థమాన షెటిలరుగా ఉన్న సింధును ఎవ్వరూ పెద్దగా పట్టించుకునేవారు కాదనే చెప్పాలి. కానీ, రియో ఒలింపిక్స్ లో ఆమె రజత పతకం సాధించడంతో సింధు ఫేట్ మారిపోయింది. పతకంతో దేశంలో అడుగు పెట్టడమే ఆలస్యం.. రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి మరీ నజరానాలు ప్రకటించేశాయి. కోట్ల రూపాయల నగదు బహుమానాలూ ప్రభుత్వ ఉద్యోగాలూ ఆఫర్ చేసేశాయి. ప్రముఖ ప్రైవేటు సంస్థలు కూడా బహుమానాలు ఇచ్చేస్తున్నాయి. ఇక, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. దేశవ్యాప్తంగా అన్ని భాషల మీడియా సంస్థలూ సింధుకు బ్రహ్మరథం పట్టాయి. దీంతో ప్రస్తుతం సింధు పేరు తెలియని భారతీయుడు ఎక్కడా ఉండడు అనడంలో సందేహం లేదు. అందుకే సింధు పేరు ఇప్పుడో కొత్త బ్రాండ్ గా అవతరించింది.
గతంతో పోల్చుకుంటే సింధు బ్రాండ్ వాల్యూ అనూహ్యంగా పెరిగింది. దీంతో ఆమెతో ఎండార్స్ మెంటులు కుదుర్చుకునేందుకు వివిధ కంపెనీలు క్యూ కడుతున్నాయట. అయితే, ఒప్పందాలు చేసుకోవడంలో ప్రస్తుతం తొందరపడటం లేదని సింధును ఎండార్స్ చేస్తున్న బ్రాండ్ మేనేజ్ మెంట్ కంపెనీ బేస్ లైన్ వెంచర్స్ చెబుతోంది. ఎందుకంటే, ఇంకొంత సమయం వేచి చూస్తే మరింత వాల్యూ పెరిగే అవకాశం ఉందని ఆ సంస్థ అభిప్రాయపడుతోంది. అయితే, ఒలింపిక్స్ కు వెళ్లేముందే రెండు ఎండార్స్ మెంట్లను సింధు ఒప్పుకున్నారనీ, సన్నాహకాల్లో ఉండటం వల్ల వాటిని ప్రకటించలేదని బేస్ లైన్ సంస్థ డైరెక్టర్ రామకృష్ణన్ తెలిపారు. సో... త్వరలో సింధు కూడా ప్రముఖ కంపెనీలకు అండార్స్ చేయబోతోందన్నమాట. ఒక్క విజయం ఆమె జీవితాన్ని మార్చేసింది అనడంలో సందేహం లేదు.