Begin typing your search above and press return to search.
సీనియార్టీని పరిగణలోకి తీసుకోని కంపెనీలు..!
By: Tupaki Desk | 5 Jan 2023 11:29 AM GMTఏదైనా కంపెనీ ఎక్కువ కాలం మనుగడ సాగించాలంటే నమ్మకమైన ఉద్యోగులు తప్పనిసరిగా. కంపెనీని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా పని చేస్తూ కొంతమంది ఉద్యోగులు సీనియర్లుగా మారుతుంటారు. అయితే ఈ సీనియార్టీ అనేది ఒక్కోసారి కంపెనీకి లాభంగా మారుతుండగా మరొసారి మాత్రం మోయలేని భారంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలోనే కొన్ని ఐటీ కంపెనీలు తమకు అనుభవం అక్కర్లేదంటున్నాయి. సీనియర్ల కంటే కూడా ఫ్రెషర్స్ ను నియమించుకునేందుకు ఆ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని టీమ్ లీజ్ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని నాలుగో త్రైమాసికంలో మన దేశంలో వివిధ సంస్థలు.. నియామక ఉద్దేశాల తీరుతెన్నులపై టీమ్ లీజ్ సర్వే నిర్వహించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
ఈ ఏడాది క్యూ4 త్రైమాసికంలో కంటే జనవరి నుంచి మార్చి వరకు వివిధ రంగాల్లో పాజిటీవ్ సెంటిమెంట్ నెలకొననుంది. ఈ నేపథ్యంలోనే సంస్థలు ఉద్యోగాల కల్పనకు తెరలేపనున్నాయి. కంపెనీల ఉద్దేశాల మేరకు మూడో త్రైమాసికం కన్నా నాలుగో త్రైమాసికంలోనే మూడు శాతం అధికంగా వృద్ధి వ్యక్తం కానుందని తెలుస్తోంది.
హైరింగ్ విషయంలో క్యూ3లో 65 శాతం కంపెనీలు సానుకూలంగా ఉన్నాయి. క్యూ4లో 68 శాతం అనుకూలంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. వాణిజ్య పరిశ్రమ నియామకాల విషయంలో 98 శాతం అనుకూలతను ప్రదర్శించాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఐటీ.. టెలికాం.. ఎడ్యుకేషనల్ సర్వీస్ తదితర రంగాలు ఉన్నాయి.
ఓవరాల్ గా అన్ని సర్వీసులు కలిసి యావరేజ్ గా 68 శాతం మంది యజమానులు హైరింగ్ సెంటిమెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. సేవా రంగంలో 77 శాతం వర్క్ ఫోర్స్ పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి. కరోనా ప్రభావం.. ఆర్థిక మాంద్యం భయాలు సర్వీస్ సెకార్టను దెబ్బతియడంతో ఐటీ రంగం ఒడిదుడుకులను లోనైంది.
అయితే ఐటీలో హైరింగ్ సెంటిమెంట్ మాత్రం పైపైకి పెరుగుతోంది తప్ప్ తగ్గడం లేదు. ఈసారి కూడా 77 శాతం కంపెనీలు కొత్త నియామకాల వైపు మొగ్గు చూపుతున్నారని టీమ్ లీజ్ సర్వేలో వెల్లడైంది. టెలికాం రంగంలో 5జీ ప్రవేశించడంతో ఈ టెక్నాలజీ బేస్డ్ ఉద్యోగాలకు 65 శాతం డిమాండ్ పెరిగింది.
ఈ మేరకు క్యూ4లో ఓవరాల్ గా మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఎంప్లాయ్ మెంట్ ఔట్ లుక్ రిపోర్టు వెల్లడించింది. పెద్ద వ్యాపారాలు.. మిడియం లెవల్ కంపెనీలు.. స్టార్టప్ కంపెనీలు సీనియర్ లెవల్ ఉద్యోగుల కంటే కూడా ఫ్రెషర్స్ ను నియమించుకునేందుకే ఆసక్తిని చూపుతున్నాయి.
బెంగూళూరులో అత్యధికంగా 97 శాతం హైరింగ్ ఇంటెంట్ ఉండగా చెన్నై 94 శాతం.. ఢిల్లీలో 90 శాతం.. హైదరాబాద్ 86 శాతం.. ముంబై 85శాతం నియామక ఉద్దేశాలను వెల్లడించాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అతితక్కువగా పాతిక శాతమే నియామక ఉద్దేశాన్ని కనబర్చినట్లు టీమ్ లిజ్ తన సర్వేలో వెల్లడించడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.