Begin typing your search above and press return to search.
రైలులో నుంచి కిందపడిన వ్యక్తికి నష్టపరిహారం ఇవ్వాలి: బాంబే హైకోర్టు
By: Tupaki Desk | 27 April 2022 4:30 PM GMTసుదూరం ప్రయాణానికి చాలా మంది రైలును ఆశ్రయిస్తారు. సేప్టీతో పాటు సౌకర్యంగా ఉండడం.. చార్జీలు కూడా తక్కువగా ఉండడంతో ట్రైన్ జర్నీపై ఆసక్తి చూపెడతారు. అయితే రైలు ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో.. అంతే ప్రమాదకరంగా ఉంటుంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలమీదకే వస్తుంది.
ఈ క్రమంలో రైలులో ప్రయాణించేవారు కేర్ బాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని ప్రమాదాలకు రైల్వే వ్యవస్థ బాధ్యలుగా ఉండాలని బాంబే హైకోర్టు సూచించింది. ఓ కేసు విచారణలో భాగంగా రైలులో ప్రయాణించే వ్యక్తికి సీటు దొరకపోయినప్పుడు రైలుపై నిలబడినప్పుడు కిందపడితే అందుకు నష్టపరిహారాన్ని చెల్లించాలని తీర్పు వెల్లడించింది.
2011 నవంబర్లో హుండీవాలా అనే 75 ఏళ్ల వ్యక్తి ముబైలోని లోకల్ ట్రైన్ లోకి ఎక్కారు. ప్రయాణికుల రద్దీతో రైలులో కాస్త ప్లేసు దొరకడంతో అక్కడ నిలబడ్డాడు. అయితే ప్రయాణికుల తోపులాటలో నితిన్ ట్రైన్ లో నుంచి కిందపడ్డాడు. దీంతో అతడికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే తనకు గాయాలవడానికి రైల్వే వ్యవస్థే కారణమని, రైల్వే యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని అధికారుల వద్దకు వెళ్లి అడిగాడు. కానీ వారు నష్ట పరిహారం ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో నితిన్ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ ఫిర్యాదుపై హైకోర్టు లోతుగా విచారించింది. నితిన్ ను గాయాలడానికి రైల్వే సిబ్బందే కారణమని తెలిపింది. ట్రైన్ కు అవసరం మేరకు టిక్కెట్లు ఇవ్వకుండా అదనంగా ఎందుకు ఇచ్చారని తప్పుబట్టింది. ముంబై లోకల్ ట్రైన్లో నిత్యం వందలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు.
ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆ ట్రైన్లో ఖాళీ ఉందా..? లేదా..? అనేది చూసుకొని టికెట్లు ఇవ్వాలని తెలిపింది. ప్రయాణికుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత రైల్వే అధికారులకు ఉందని జస్టిస్ భారతి డాంగ్రే తో కూడిన సింగిల్ బెంచ్ తెలిపింది. అంతేకాకుండా బాధితుడికి రూ. 3 లక్షలు చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది.
ఈ కేసు 11 ఏళ్ల కిందటిదైనా రైల్వే వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయని, అందువల్ల ప్రయాణికుల జాగ్రత్తలపై అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రయాణికుల రద్దీ ఉందని తెలిసినా రైల్వే అధికారులు టిక్కెట్లు జారీ చేయడంపై తప్పక నష్టపరిహారం చెల్లించాల్సిందేనని అన్నారు. ఇది ముమ్మాటికీ అవాంచనీయ ఘటనేనని, బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలని పశ్చిమ రైల్వే శాఖను బాంబే హైకోర్టు ఆదేశించింది.