Begin typing your search above and press return to search.
తాండూరులో ఈ మాజీ మంత్రుల కుమారుల మధ్యేనా పోటీ?
By: Tupaki Desk | 11 July 2022 6:30 AM GMTతెలంగాణలోని తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రుల తనయులు సిద్ధమవుతున్నారా? ఈ స్థానం నుంచి పోటీ చేస్తే గెలుపు సొంతమవుతుందనే భావనలో ఉన్నారా అంటే అవుననే అంటున్నారు.
గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో, ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో ఉన్న తాండూరు నుంచి మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి రెండుసార్లు, మాజీ మంత్రి మాణిక్యరావు మూడుసార్లు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి చంద్రశేఖర్ రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ప్రస్తుతం తాండూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రోహిత్ రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డిని ఓడించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగం ఆ పార్టీలో చేరిపోయారు.
దీంతో తాండూరు టీఆర్ఎస్ లో ఓవైపు పట్నం మహేందర్ రెడ్డి, మరోవైపు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ బహిరంగంగానే సవాళ్లు విసురుకున్నారు. వచ్చే ఏడాదిలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాండూరులో పోటీ చేయడానికి పలువురు మాజీ మంత్రుల తనయులు కూడా సిద్ధమవుతున్నారు.
వీరిలో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మనవడు మర్రి శశిధర్‌రెడ్డి తనయుడు మర్రి ఆదిత్యారెడ్డి, ఎం.చంద్రశేఖర్ తనయుడు ఎం.నరేష్ తాండూరు శాసన సభకు పోటీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2014 ఎన్నికల్లో తాండూరు టీడీపీ అభ్యర్థిగా ఎం.నరేష్ పోటీ చేసి 12వేల వరకు ఓట్లు తెచ్చుకున్నారు. అంతకుముందు వరకు నరేష్ కాంగ్రెస్ లో ఉన్నారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత తిరిగి కాంగ్రెస్ లో చేరారు. మళ్లీ గత శాసన సభ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ పార్టీలో చేరినా టికెట్ దక్కలేదు. ఈ నేపథ్యంలో తనకు టికెట్ ఇస్తానంటే కాంగ్రెస్ లో చేరతానని చెబుతున్నారు. లేదా బీజేపీ టికెట్ ఇస్తే అందులో అయినా చేరిపోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని సమాచారం.
మరోవైపు మర్రి చెన్నారెడ్డి మనవడు, మాజీ మంత్రి శశిధర్‌రెడ్డి తనయుడైన మర్రి ఆదిత్యారెడ్డి 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 651 ఓట్లు సాధించారు. ఆదిత్యరెడ్డి తండ్రి మర్రిశశిధర్‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆదిత్యరెడ్డి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. ఈసారి తాండూరు నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్నారు. ప్రస్తుతం తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కు కీలక నేత కూడా లేరు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో మర్రి ఆదిత్యారెడ్డికి మంచి అవకాశం లభించినట్టైంది.
మరోవైపు తాండూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ లో ఉంటున్న ఆదిత్యారెడ్డిని కలసి తాండూరు నుంచి పోటీ చేయాలని విన్నవించారు. ఈ నేపథ్యంలో ఓవైపు నరేష్, మరోవైపు ఆదిత్యారెడ్డి తమ తండ్రులు, తాతల పేరుప్రతిష్టలను వాడుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు.