Begin typing your search above and press return to search.
పేరు పెట్టండి.. లక్షలు అందుకోండి : కేంద్రం
By: Tupaki Desk | 28 July 2021 12:30 PM GMTసరైన పేరు పెట్టండి ..లక్షల బహుమతి అందుకోండి , ఇదేదో లక్కీ డ్రా అనుకోకండి. దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఓ ఆసక్తికరమైన పోటీ పెట్టింది. తాము ప్రవేశపెట్టిన కొత్త పథకానికి అనువైన పేరు, ట్యాగ్ లైన్, లోగోలను సూచించిన వారికి భారీ బహుమతులు ఇస్తామని ప్రకటించింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం ఇటీవల డెవలప్ మెంట్ ఫైనాన్షియల్ ఇన్సిస్టిట్యూషన్(డీఎఫ్ ఐ)కి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీని తీరుతెన్నులు, లక్ష్యాలను స్పూరించే విధంగా పేరు, లోగోలతో పాటు ట్యాగ్‌లైన్‌ను సూచించాలని ఆర్ధిక శాఖ ప్రజలని కోరుతోంది.
కేంద్రం ఇటీవల మౌలిక సదుపాయల కల్పన కోసం డెవలప్ మెంట్ ఫైనాన్షియల్ ఇన్సిస్టిట్యూషన్ కి ఆమోదం తెలిపింది. ఇప్పుడీ డీఎఫ్ ఐ... తీరు తెన్నులు, లక్ష్యాలను స్ఫూరించేలా ఈ పథకానికి పేరు, ట్యాగ్ లైన్, లోగోలను సూచించాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ఆగస్టు 15వ తేది సాయంత్రం 5:30 గంటల్లోగా తమ ఎంట్రీలను పంపించాలని తెలిపింది. ఈ పోటీలో ఒక్కో విభాగంలో మొదటి స్థానంలో నిలిచినవారికి రూ. 5 లక్షలు, రెండో స్థానానికి రూ. 3 లక్షలు, మూడో స్థానానికి రూ. 2 లక్షలు బహుమతులుగా అందజేస్తామన్నారు. పేరు, ట్యాగ్ లైన్, లోగోలకు సంబంధించిన డిజైన్లను https://www.mygov.in/task/name-tagline-and-logo-contest-development-financial-institution లింక్ ద్వారా పంపించాలని కేంద్రం పేర్కొంది. దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రజలందరికీ తేలికగా అర్థం అయ్యేలా, పలకడానికి సులువుగా ఉండేలా డీఎఫ్‌ఐకి సంబంధించిన పేరు, ట్యాగ్‌లైన్, లోగోలు ఉండాలని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, డెవలప్ మెంట్ యాక్ట్ 2021 ద్వారా డెవలప్ మెంట్ ఫైనాన్షియల్ ఇన్సిస్టిట్యూషన్ (డీఎఫ్ ఐ)కి ఆమోదం తెలిపింది. డీఎప్‌ఐ ద్వారా దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, మెరుగు పరచడం కోసం భారీ ఎత్తున ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. సుమారు 1.11 లక్షల కోట్ల వ్యయంతో 7,000 ప్రాజెక్టులు చేపట్టబోతుంది. ఈ పథకం ద్వారా దేశ రూపురేఖలు మారిపోతాయని కేంద్రం చెబుతోంది.