Begin typing your search above and press return to search.
ఈటల కుమారుడిపై ఫిర్యాదు.. విచారణకు కేసీఆర్ ఆదేశం
By: Tupaki Desk | 23 May 2021 9:37 AM GMTతెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఇప్పటికే భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి సీఎం కేసీఆర్ తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈటల కుమారుడిపై కూడా భూకబ్జా ఆరోపణలు వస్తున్నాయి.
ఈటల కొడుకు నితిన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాజాగా ఫిర్యాదు అందింది. నితిన్ భూకబ్జాకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మహేష్ అనే వ్యక్తి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. మేడ్చల్ జిల్లా రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ అనే వ్యక్తి కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని లేఖలో కోరారు.
దీనిపై స్పందించిన కేసీఆర్.. దీనిపై తక్షణమే విచారణ ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఏసీబీ విజిలెన్స్, రెవెన్యూ శాఖలు దీనిపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని అన్నారు.
ఇప్పటికే మెదక్ జిల్లా అచ్చంపేటలో భూకబ్జా ఆరోపణలతో ఈటల రాజేందర్ మంత్రి పదవి కోల్పోయారు. ఆయనపై విచారణ జరిపి నిగ్గుతేల్చిన కేసీఆర్ సర్కార్ ఈ చర్య తీసుకుంది. ఇప్పుడు ఆయన కొడుకుపై కూడా భూకబ్జా ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ సర్కార్ దీనిపై విచారణకు ఆదేశించడం సంచలనమైంది.