Begin typing your search above and press return to search.
బ్రాహ్మణి వివాహంపై ఫిర్యాదు
By: Tupaki Desk | 16 Nov 2016 5:32 AM GMTమైనింగ్ వ్యాపార దిగ్గజం - మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కూతురు బ్రాహ్మణి వివాహం మరోమారు వార్తల్లోకి ఎక్కింది. హైదరాబాద్ కు చెందిన యువ పారిశ్రామికవేత్త రాజీవ్ రెడ్డితో బుధవారం జరుగనుంది. మంగళవారం నుంచి తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగే కల్యాణానికి బెంగళూరు ప్యాలెస్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 36 ఎకరాల్లో హంపీలోని పురంధర ఆలయం నమూనాను - తిరుపతిలోని ఏడు ద్వారాలు ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నమూనాతో పెళ్లి వేదికను తీర్చిదిద్దారు. వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని పోలివున్న వేదికపైనే వివాహం జరుగనున్నది.
ఇదిలాఉండగా గాలి ఇంట్లో జరిగే పెళ్లికి అనధికారికంగా ఎవరూ హాజరుకాకూడదని బీజేపీ అధిష్ఠానం చెప్పినట్టు తెలిసింది. ఈ మేరకు జనార్దన్ రెడ్డిపై అభిమానం ఉన్నప్పటికీ పేరున్న బీజేపీ నేతలు ఎవ్వరూ మొదటిరోజు వేడుకలకు హజరుకాలేదు. కాగా రాష్ట్రస్థాయిలో కొంత మంది కిందిస్థాయి బీజేపీ నేతలు మాత్రం హజరైనట్టు సమాచారం. గాలితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా కేంద్రమంత్రులు అనంతకుమార్ - సదానంద గౌడ తదితరులు హాజరయ్యే అవకాశముంది. గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో జరిగే పెళ్లికి పార్టీ హైకమాండ్ హాజరుకావొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి - సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప అన్నారు. గాలి ఇంట్లో పెళ్లికి ఆహ్వానం అందింది. నేను హాజరు అవుతున్నాను అని ఆయన తెలిపారు
మరోవైపు గాలి జనార్దన్ రెడ్డిపై సమాచార హక్కు - సామాజిక కార్యకర్త టి.నరసింహమూర్తి ఆదాయపు పన్ను డైరెక్టర్ జనరల్ కు మంగళవారం ఫిర్యాదు చేశారు.40 నెలలు గాలి జనార్దనరెడ్డి జైలులో ఉన్న వ్యక్తి ఇప్పుడు రూ.650 కోట్ల వ్యయంతో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుపుతున్నారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ అంశాలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెంగళూరు రాజమహల్ మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఆయన కుమార్తె వివాహ వేడుకలకు వ్యయం చేస్తున్న నిధుల మూలాలపై విచారణ జరపాలని ఫిర్యాదులో కోరారు. అనంతరం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ పరిశీలించి చర్య తీసుకుంటామని ఆదాయపుపన్ను శాఖ ఉన్నతాధికారులు భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ‘ఆడబిడ్డ పెళ్లిని అడ్డుకోవటం నా ఆలోచన కాదు. ఈ తంతు కోసం గాలి జనార్దనరెడ్డి విచ్చల విడిగా చేస్తున్న ఖర్చు ఆక్షేపణీయం’అని నరసింహమూర్తి వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/