Begin typing your search above and press return to search.

కోడెల కొడుకుపై పిర్యాదు?

By:  Tupaki Desk   |   16 Sep 2019 12:04 PM GMT
కోడెల కొడుకుపై పిర్యాదు?
X
ఏపీ మాజీ స్పీకర్ - టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పాలక వైసీపీ రాజకీయంగా కక్ష సాధిస్తూ ఆయన్ను వెంటాడడంతో ఆ వేదన భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా కోడెల మేనల్లుడు - వైసీపీ నేత కంచేయి సాయిరామ్ వేరే ఆరోపణలు చేశారు. కోడెలను ఆయన కుమారుడు శివరాం హత్య చేశాడని సాయిరామ్ ఆరోపించడం సంచలనంగా మారింది. అయితే, ఆయన స్వయంగా ప్రకటన చేసినట్టు ఎక్కడా వార్తలు రాలేదు. కాకపోతే ఆయన పేరుతో పోలీసులు ఫిర్యాదు ఇచ్చినట్లు ఓ కాపీ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. ... దీని గురించి అందులో అడ్రెస్ చేసిన సత్తెనపల్లి డీఎస్పీ నుంచి పోలీసులు కేసు నమోదు చేసినట్టు ఏ ప్రకటన వెలువడలేదు. ఇక సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఆ ఫిర్యాదు కాపీలో ఏముందంటే... ఆస్తి కోసం కోడెలను ఆయన కుమారుడు శివరాం హత్య చేశాడని ఆ ఫిర్యాదులో ఆరోపించారు.

కోడెలను హత్య చేసిన ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని సాయి ఆరోపించారు. తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కోడెల తనకు ఫోన్ చేసేవారని.. దాంతో తాను ఎన్నోసార్లు శివరాంకి కూడా నచ్చచెప్పానని ఆయన అన్నారు.ఇటీవల కూడా శివరాంను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించానని... అయితే అది కుదరలేదని వివరించారు. కోడెలకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కోడెల మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కచ్చితంగా ఇది కుమారుడు చేసిన హత్యేనని ఆయన ఆరోపించారు. వైసీపీ వేధించినదని చెప్పడం అవాస్తమవని... కేవలం కుమారుడి వేధింపుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

మరి ఎవరైనా సృష్టించి సోషల్ మీడియాలో వదిలిన కాపీయా? లేక నిజంగా అతను ఫిర్యాదు చేశారా అనే విషయం త్వరలో తెలుస్తుంది.