Begin typing your search above and press return to search.
పవన్ పై పొలిటికల్ గా ఫస్ట్ కేసు
By: Tupaki Desk | 30 Aug 2016 5:02 AM GMTజనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అప్పుడే పొలిటికల్ కేసుల సెగ తగులుతోంది! పాలిటిక్స్ అన్నాక ఏం మాట్లాడినా.. ఎగ్గుమీద హెయిర్ లాగే వాళ్లు ఎక్కువ మందే ఉంటారు. ఇలాంటోళ్లతో ఎప్పటికప్పుడు అలెర్ట్ గానే ఉండాలి. ఇక, తాజా విషయానికి వచ్చే సరికి.. మొన్న శనివారం తిరుపతి వేదికగా పవన్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఓ రేంజ్ లో ఏపీ పాలిటిక్స్ పై రెచ్చిపోయిన విషయం తెలిసిందే. అటు చంద్రబాబును పొగుడుతూనే ప్రత్యేక హోదాపై ఆయన ఎంపీలు ఏమీ చేయడం లేదన్నా పవన్.. తనకు కూడా కులం పేరుతో మెడలో కార్డేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇది ఎంత మాత్రమూ సమంజసం కాదని అన్నారు.
కులం పేరుతో తనను ఇరుకున పెట్టాలని చూస్తున్నారని అన్నారు. తనకు కులాలు - మతాలు రుద్దితే మంట అరికాలి నుంచి నషాళానికి ఎక్కుతుందని హెచ్చరించారు. మానవత్వమే తన మతమని - సర్వ మత సమానత్వమే తన కులమని చెప్పారు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీ విషయాలను కూడా పవన్ సభలో వెల్లడించారు. తన భార్య కోరిక మేరకు తన కుమార్తెకు బాప్టిజ్ ఇప్పించానని చెప్పారు. తనకు కులం అంటగట్టద్దని చెప్పారు. ఇక, ఇప్పుడు ఈ వ్యాఖ్యలే పవన్ పై కేసుకు దారితీశాయి. ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు దేరంగుల ఉదయ్ కిరణ్... జనసేన అధినేత వ్యాఖ్యల్లో తప్పులు వెతికారు.
భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ - ఎస్టీ - బీసీ కమిషన్లను ఏర్పాటు చేసి రిజర్వేషన్లు అమలు చేస్తుండగా, వారి హక్కులకు భంగం కలిగేలా పవన్ మాట్లాడారని పేర్కొంటూ.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. తిరుపతి సభలో పవన్ పలు కులాలు - మతాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన సోమవారం దాఖలు చేసిన ఫిర్యాదులో అభ్యర్థించారు. అయితే, ఈ పిటిషన్ ను సాయంత్రానికల్లా హెచ్చార్సీ తిరస్కరించడం గమనార్హం. ఏదేమైనా పొలిటికల్ గా పవన్ మరింత జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని ఈ ఘటన పేర్కొంటున్నట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.