Begin typing your search above and press return to search.

వీర్రాజు మా అధ్య‌క్షుడా..వ‌ద్దే వ‌ద్దు

By:  Tupaki Desk   |   30 April 2018 10:56 AM GMT
వీర్రాజు మా అధ్య‌క్షుడా..వ‌ద్దే వ‌ద్దు
X
ఏపీ బీజేపీ రాజకీయాల‌పై కొత్త చ‌ర్చ మొద‌లైంది. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న హ‌రిబాబు రాజీనామా నేప‌థ్యంలో కొత్త అధ్య‌క్షుడి ఎంపిక త‌ప్ప‌నిస‌రి అయింది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలోని బీజేపీ పెద్ద‌లు క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టి అన్ని అంశాల‌ను కూలంక‌షంగా చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. పార్టీ సీనియ‌ర్లు, టీడీపీని గ‌ట్టిగా ఎదుర్కునే నేతలు, పార్టీని బ‌లోపేతం చేయ‌గ‌లిగే సామ‌ర్థ్య‌మున్న‌నాయ‌కులు...ఇలా ప‌లుర‌కాలా వ‌డ‌పోత‌ల అనంత‌రం ఈ ప్ర‌క్రియ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇందులో ప్ర‌ధానంగా ఇటీవ‌ల మారిన స‌మీక‌ర‌ణాల ప్ర‌కారం...టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుపై దూకుడుగా స్పందించే ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు అధ్యక్ష పదవి వరించింద‌ని తెలుస్తోంది. అయితే ఇదే స‌మ‌యంలో పార్టీ నేత‌ల‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదు అందుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఆయ‌న‌పై ఫిర్యాదు అందిన‌ట్లు స‌మాచారం.

బీజేపీకి చెందినపార్టీ నేత‌ల స‌మాచారం చ‌ర్చ‌ల ప్ర‌కారం రాష్ట్రంలో పరిస్థితులను అధిష్ఠానానికి వివరించేందుకు కొన్ని రోజులుగా పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీ నాయకులతో, ప్రజా ప్రజా ప్రతినిధులతో చర్చించకుండా... వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా రాష్ట్ర అధ్యక్షుడిని నియమించడమేమిటన్నది వీరి ప్రధాన అభ్యంతరం. సోము వీర్రాజు వ్యాఖ్యలు పార్టీని బలోపేత౦ చెయ్యకపోగా బలహీన పరిచే విధంగా ఉన్నాయని వారు వ్యాఖ్యానించినట్టు సమాచారం. గత నాలుగేళ్ళలో పార్టీలోకి వచ్చిన వారికి రాష్ట్ర బీజేపీలో ఏ మాత్రం విలువ లేదని చెప్పినట్టు సమాచారం. ఆయ‌న‌కు అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వ‌డం స‌రైంది కాద‌ని ఓ ఎమ్మెల్యే సైతం ఫిర్యాదు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే నియామ‌కం ఆపిన‌ట్లు వివ‌రిస్తున్నారు.

మ‌రోవైపు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ పార్టీకి గుడ్ బై చెప్ప‌డాన్ని కూడా బీజేపీ పెద్ద‌లు సీరియ‌స్‌గా తీసుకున్నార‌ని తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి అనేక మంది పోటీ పడ్డారు. పార్టీ అధ్యక్ష రేసులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్లు చివరి వరకూ పరిశీలనలో ఉన్నాయి. అధిష్టానం మాత్రం సోము వీర్రాజు వైపు మొగ్గు చూపింది. తనకే అధ్యక్ష పదవి దక్కుతుందని ఆశించిన కన్నా లక్ష్మీనారాయణ పదవి రాకపోవడంతో భంగ పడ్డారు. దీంతో వైసీపీలోకి మారాలనే ఆలోచనతో గ‌త శనివారం గుంటూరులో తన అనుచరులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు కూడా. ఈ నేప‌థ్యంలోనే అధ్య‌క్ష‌ ఎంపిక‌ను కూడా ఆపిన‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది.