Begin typing your search above and press return to search.
తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు .. ఏం జరిగిందంటే ?
By: Tupaki Desk | 10 May 2021 7:30 AM GMTతెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై అసత్య కథనాలు ప్రసారం చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని టీఆర్ ఎస్ నాయకులు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఘట్ కేసర్ రెవెన్యూ పరిధిలోని మైసమ్మగుట్టకు సంబంధించిన భూములను మంత్రి మల్లారెడ్డి ఆక్రమించాడని క్యూ న్యూస్ లో తీన్మార్ మల్లన్న ప్రసారం చేసినట్లు వెల్లడించారు. మైసమ్మగుట్టకు సంబంధించి మొత్తం 203 ఎకరాల్లో ఉన్నవి పట్టా భూములని, వాటిని ఆనుకొని సర్వేనెంబర్ 543/2లోని 18 ఎకరాల భూమి మాత్రమే ప్రభుత్వ భూమి అని, ప్రస్తుతం ఆ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉందన్నారు.
పట్టా భూములకూ మంత్రి మల్లారెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదని వారు తెలిపారు. తీన్మార్ మల్లన్న కావాలనే మంత్రిపై ఆసత్య ప్రసారాలు చేస్తూ, ఆయన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆరోపణలు చేశారు. మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పొందుపరిచారు. ఫిర్యాదుచేసిన వారిలో ఘట్ కేసర్ మునిసిపాలిటీ చైర్ పర్సన్ ముల్లి పావని, వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, కౌన్సిలర్లు బండారి ఆంజనేయులు, బేతాల నర్సింగ్ రావు, కడుపోల్ల మల్లేశ్, టీఆర్ ఎస్ ఘట్ కేసర్ మునిసిపాలిటీ శాఖ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, ముల్లి జంగయ్య యాదవ్, అబ్బసాని పొన్నయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.
ఇదిలా ఉంటే .. నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన తీన్మార్ మల్లన్నకు ప్రజలు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. అధికార పక్షం అరాచకాలపై గొంతెత్తిన మల్లన్నకు ఓట్లతో మద్దతు తెలిపారు. అధికార పార్టీ అభ్యర్థి, ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితుడికి ముచ్చెమటలు పట్టించారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయాలతో ఊపుమీదున్న బీజేపీ దూకుడుకు సైతం కళ్లెం వేసి మరీ సామాన్యుడి వెన్నుతట్టారు. ఇక కాంగ్రెస్ సోయి లేకుండా పోయింది. టీజేఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోదండరాం కూడా వెనకబడిపోయారు. అయితే చివరి వరకు రేసులో నిలిచినా కూడా విజయం మాత్రం సాధించలేకపోయారు.