Begin typing your search above and press return to search.
బెజవాడ కార్పొరేటర్లు బరితెగించేస్తున్నారు
By: Tupaki Desk | 2 Jan 2017 10:19 AM GMTవిజయవాడ టీడీపీ కార్పొరేటర్ల తీరు తరచూ వివాదాస్పదమవుతోంది. ఇంతకుముందు విజయవాడకు చెందిన టీడీపీ కార్పొరేటర్లు కొందరు విహారయాత్ర కోసం పుణె వెళ్లి అక్కడ రైల్వే స్టేషన్లో ఆడవాళ్లలో అసభ్యంగా బిహేవ్ చేసి అడ్డంగా దొరికిపోయారు. మందుకొట్టి వారు హల్ చల్ చేయడంతో పోలీసులకు దొరికారు. మరో కార్పొరేటర్ హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో వస్తూ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి దొరికాడు. ఇప్పుడు కొత్త సంవత్సరం సందర్భంగా మరో కార్పొరేటర్ రెచ్చిపోయి ఆడవాళ్లను రోడ్లపై పరుగులు తీయించాడు. తాజా ఘటనపై విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి.
కొత్త సంవత్సరం రాక సందర్భంగా నరసింహరావు అనే టీడీపీ కార్పొరేటర్ డిసెంబరు 31న అర్ధరాత్రి తన డివిజన్ లో బైక్ ర్యాలీ తీశారు. నరసింహరావు బ్యాచ్ మొత్తం బైకులపై వీధుల్లో తిరుగుతూ ఆ సమయానికి ఇళ్ల ముందు ముగ్గులేస్తున్న మహిళలను బెదరగొట్టింది. సర్రుసర్రున బైకులపై రౌండ్లు కొడుతూ చాలాసేపు గుండెల్లో రైళ్లు పరుగెత్తించారని... ఎవరిపైకి బండ్లు దూసుకొస్తాయో అని భయపడ్డామని మహిళలు చెబుతున్నారు.
నరసింహరావు బ్యాచ్ దెబ్బకు భయపడిపోయిన మహిళలు ముగ్గులేయడం మానేసి ఇళ్లలోకి పరుగులు తీశారు. ఆడవాళ్లు అలా పరుగులు తీస్తుంటే టీడీపీ కార్పొరేటర్ - అతడి అనుచరులు శాడిస్టుల తరహాలో ఆనందించారట. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మల్లేష్ అనే యువకుడిని కార్పొరేటర్ - అనుచరులు చితక్కొట్టారు. కార్పొరేటర్ నరసింహారావుపై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని చెబుతున్నారు. దీంతో మహిళలంతా కృష్ణలంకలో ధర్నాకు దిగారు. చంద్రబాబు సంక్షేమ రాజ్యంలో రాజధాని ప్రాంతంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/