Begin typing your search above and press return to search.
సోనియా - ప్రియాంక - ఓవైసీ..అందరిదీ ఒకటే మంత్రం
By: Tupaki Desk | 25 Dec 2019 9:07 AM GMTపౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సీఏఏ - ఎన్నార్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల కొనసాగుతున్న నిరసనలకు మద్దతు తెలుపుతున్నట్టు 70కి పైగా విద్యార్థి - యువజన సంఘాలు మంగళవారం ఢిల్లీలో ప్రకటించాయి. నూతన సంవత్సరం రోజున నేషనల్ యంగ్ ఇండియా కో-ఆర్డినేషన్ అండ్ క్యాంపేయిన్ (వైఐఎన్ సీసీ)తో పాటు మరికొన్ని మద్దతు సంఘాలతో రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేస్తామని విద్యార్థి నాయకులు తెలిపారు. అయితే, ఇదే సమయంలో యూపీలో ఓ ఆసక్తికర కేసు నమోదు అయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కూతురు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ - ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆందోళనకారులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
సీఏఏకు వ్యతిరేకంగా యూపీలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటికే పలువురు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఓ ఆసక్తికర పిటిషన్ దాఖలైంది. సోనియా - ప్రియాంక - అసదుద్దీన్ ఓవైసీలపై యూపీలోని అలీగఢ్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రదీప్ గుప్తా అనే అడ్వకేట్ ఫిర్యాదు చేశారు. వీరు చేస్తున్న ప్రసంగాలు.. ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయంటూ వీరిపై కేసు నమోదు చేయాలంటూ ఆ న్యాయవాది విన్నవించారు. కాగా, ఈ ఫిర్యాదును స్వీకరించిన కోర్టు.. విచారణను జనవరి 24కు వాయిదా వేసింది.
మరోవైపు - సీఏఏకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ లో చేపట్టిన నిరసనల్లో భాగంగా రేగిన హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఢిల్లీ నుంచి బయల్దేరిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ - ప్రియాంక గాంధీ వాద్రాను యూపీలోని మీరట్ లో పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. సున్నిత ప్రాంతమైన మీరట్‌లో 144 సెక్షన్ విధించామని - పర్యటన వల్ల జిల్లాలో ఏమైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే మీరే(రాహుల్ - ప్రియాంక) బాధ్యత వహించాలని వాళ్లతో చెప్పామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. దీంతో రాహుల్ - ప్రియాంక ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యారు.