Begin typing your search above and press return to search.
చిక్కుల్లో గిరీష్-ప్రకాష్ రాజ్.. ప్రతీకార జ్వాల
By: Tupaki Desk | 8 Sep 2018 11:52 AM GMTకన్నడ ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత , బహుబాష నటుడు గిరీష్ కర్నాడ్ పై కర్ణాటక హైకోర్టు న్యాయవాది అమృతేశ్ బెంగళూరులోని విధాన సౌధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాష్ రాజ్ పై కూడా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గిరీష్ కర్నాడ్ ఇటీవల ‘నేను అర్బన్ నక్సల్’ అనే ఫ్లకార్డును మెడలో వేసుకొని బీజేపీ ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. గిరీష్ కర్నాడ్ సంఘ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తున్నారని న్యాయవాది అమృతేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. గిరీష్ కర్నాడ్ కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అరెస్ట్ చేసి విచారణ చేయాలని పోలీసులను కోరారు. ఇదివరకే గిరీష్ కర్నాడ్ పై శ్రీరామ సేన - హిందూ జనజాగృతి సమితి నాయకులు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ టీ. సునీల్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.
*వివాదమిదీ..
ప్రముఖ కన్నడ పత్రిక ‘లంకేష్’ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్యకు గురైన విషయం తెలిసిందే..లంకేష్ ప్రథమ వర్ధంతి సెప్టెంబర్ 5వ తేది బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గిరీష్ కర్నాడ్ తో పాటు నటుడు ప్రకాష్ రాజ్ - స్వామి అగ్నివేష్ - జిగ్నేష్ మేవానీ - కన్హయ్య కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరీష్ కర్నాడ్ తన మెడలో ఫ్లకార్టు వేసుకొని దానిపై ‘నేను నగర నక్సల్’ అని రాసుకొని కార్యక్రమం అయిపోయేంత వరకూ నిరసన తెలిపారు. గిరీష్ నిరసనపై విమర్శలు చెలరేగాయి..
ప్రభుత్వం నిషేధించిన నక్సలిజాన్ని బహిరంగంగా సమర్థించినందుకు గిరీష్ కర్నాడ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది అమృతేష్ ఫిర్యాదు చేయడంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఈ విషయంపై గిరీష్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. తన మీద ఫిర్యాదు చేసినందుకు ఎవరి మీద కోపం లేదని స్పష్టం చేశారు. గిరిష్ కు మద్దుతగా నటుడు ప్రకాష్ రాజ్ నిలబడ్డాడు.