Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఇమేజ్ డ్యామేజ్ చేయ‌టానికి స‌రికొత్త కుట్ర‌!

By:  Tupaki Desk   |   25 Dec 2018 4:57 AM GMT
జ‌గ‌న్ ఇమేజ్ డ్యామేజ్ చేయ‌టానికి స‌రికొత్త కుట్ర‌!
X
ఏపీ ప్ర‌జ‌ల్లో ఆ రాష్ట్ర విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అంత‌కంత‌కూ పెరుగుతున్న ఆద‌ర‌ణ చూసి క‌న్ను కుట్టిందో ప్ర‌బుద్ధుడికి. ప‌క్కాగా ప్లాన్ చేసి.. జ‌గ‌న్ పీఏ పేరుతో దందా చేస్తున్న దుర్మార్గాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు దృష్టి సారించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌తో పాటు.. ప‌లువురికి జ‌గ‌న్ పీఏ అంటూ ఫోన్ చేయ‌ట‌మే కాదు.. డ‌బ్బులు వ‌సూలు చేసే కుట్ర‌కు తెర తీసిన వైనాన్ని ఆపార్టీ నేత‌లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు నాగేశ్వ‌ర్ రెడ్డి పేరుతో ఆయ‌న ఫోన్ నెంబ‌ర్ ను దుర్వినియోగం చేస్తూ ఆయ‌న పార్టీ నేత‌ల‌కు ఇటీవ‌ల కాలంలో మెసేజ్ లు వెళుతున్నాయి. డ‌బ్బులు కావాలంటూ ఫోన్లు.. మెసేజ్ లతో పాటు వాట్సాప్ మెసేజ్ లు చేస్తున్న వైనంపై ఆ పార్టీ నేత‌లు హైద‌రాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. పార్టీ ఐటీ సెల్ నాయ‌కుడు హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రెడ్డి.. లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి త‌దిత‌రులు హైద‌రాబాద్ సీపీని క‌లిసి ఆయ‌న‌కు ఫిర్యాదు చేశారు.

జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఉన్న‌ప్పుడు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు జ‌గ‌న్ పీఏ పేరుతో ఫోన్ చేసి డ‌బ్బు తీసుకురావాలంటూ మెసేజ్ లు పెడుతున్న ఉదాహ‌ర‌ణ‌ను ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. అయితే.. ఈ అంశంపై ఫిర్యాదును ఏపీలో కాకుండా హైద‌రాబాద్ లో ఇవ్వ‌టానికి ప్ర‌త్యేక‌కార‌ణం ఉంది. జ‌గ‌న్ పీఏ పేరుతో ఫోన్ చేస్తున్న ఫోన్ నెంబ‌రు జ‌గ‌న్ నివాస‌మైన లోట‌స్ పాండ్ అడ్ర‌స్ లో ఉండ‌టంతో ఈ వ్య‌వ‌హారాన్ని హైద‌రాబాద్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

ఇప్ప‌టివ‌ర‌కూ దాదాపు 15 మంది జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌కు బెదిరింపు కాల్స్ వెళ్ల‌టాన్ని సీరియ‌స్ గా తీసుకున్న పార్టీ.. తాజాగా పిర్యాదు చేసింది. జ‌గ‌న్‌ కు వ‌స్తున్న పేరును దెబ్బ తీయ‌టంతో పాటు.. ప‌ర‌ప‌తిని త‌గ్గించేందుకు జ‌రుగుతున్న కుట్ర‌ను బ‌ద్ధ‌లు చేయాల‌ని పోలీసుల‌ను కోరారు. ఫిర్యాదు స్వీక‌రించిన హైద‌రాబాద్ సీపీ అంజ‌న్ కుమార్‌.. ఈ కేసును సైబ‌రాబాద్ సైబ‌ర్‌ క్రైమ్ అధికారుల‌కు బ‌దిలీ చేశారు.