Begin typing your search above and press return to search.

'న్యూడ్ ఎంపీ' చుట్టూ ముదురుతున్న వివాదం.. రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు

By:  Tupaki Desk   |   24 Aug 2022 3:50 AM GMT
న్యూడ్ ఎంపీ చుట్టూ ముదురుతున్న వివాదం.. రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు
X
వైసీపీ న్యూడ్ ఎంపీ.. హిందూపురం పార్ల‌మెంటు స‌భ్యుడు గోరంట్ల మాధ‌వ్ వ్య‌వ‌హారం మ‌రింత ముదురుతోంది. ఈ వివాదం రాష్ట్రం నుంచి ఇప్పుడు కేంద్రం వ‌ర‌కు పాకింది. ఎంపీ న్యూడ్ వీడియోపై డిగ్నిటీ ఫ‌ర్ ఉమ‌న్ జేఏసీ ఆధ్వ‌ర్యంలో మ‌హిళ‌లు రాష్ట్ర‌ప‌తిని క‌లిశారు. జ‌రిగిన ఉదంతాన్ని వివ‌రించారు. మ‌హిళ‌ల విష‌యంలో ఒక పార్ల‌మెంటు స‌భ్యుడే ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నా ర‌ని.. ఫిర్యాదు చేశారు. ఆయ‌న‌ను త‌క్ష‌ణ‌మే ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని.. భవిష్య‌త్తులో చ‌ట్ట‌స‌భ‌ల నుంచి బ‌హిష్క‌రించే నిర్ణ యం తీసుకోవాల‌ని కోరారు.

మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వానికి భంగం క‌లిగించేలా సాక్షాత్తూ ఒక పార్ల‌మెంటు స‌భ్యుడే ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ఏంట‌ని.. వారు ప్ర‌శ్నించారు. దీనిపై తాము రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌, డీజీపికి ఫిర్యాదు చేసినా.. వారు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని రాష్ట్ర‌ప‌తి దృష్టి కి తెచ్చారు. ఇప్ప‌టికైనా.. రాష్ట్ర‌ప‌తి జోక్యం చేసుకుని.. ఎంపీపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి 'అస‌లు ఏం జ‌రిగింద‌ని' మ‌హిళా నేత‌ల‌ను ప్ర‌శ్నించి తెలుసుకున్నారు. అనంత‌రం.. వారి నుంచి వివ‌రాలు న‌మోదు చేసుకుని.. చ‌ర్య‌లు తీసుకునేలా చూస్తాన‌ని హామీ ఇచ్చినట్టు మ‌హిళా నాయ‌కులు తెలిపారు.

అనంత‌రం జేఏసీ నాయ‌కురాళ్లు.. కేంద్ర ఆరోగ్య శాఖ స‌హాయ మంత్రి భార‌తీ ప‌వార్‌ను కూడా క‌లిసి ఎంపీ విష‌యాన్ని న్యూడ్ వీడియోల‌ను వివ‌రించారు. ఆ త‌ర్వాత‌.. జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌ను కూడా క‌లిసి ఫిర్యాదు చేశారు. అనంత‌రం జేఏసీ నాయ‌కురాళ్లు మీడియాతో మాట్లాడుతూ..

మ‌హిళ‌ల విష‌యంలో వైసీపీ ఎంపీ వ్య‌వ‌హ‌రించిన తీరు తీవ్ర జుగుప్సాక‌రంగా ఉంద‌ని.. దీనిపై మ‌హిళ‌గా ఉన్న రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు చేస్తే.. త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌నే ఉద్దేశంతోనే ఢిల్లీ వ‌ర‌కు వ‌చ్చామ‌ని వివ‌రించారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దాడులు.. చిన్నారుల‌పై జ‌రుగుతున్న అత్యాచార ఘ‌ట‌న‌ల‌ను కూడా రాష్ట్ర‌ప‌తికి వివ‌రించిన‌ట్టు చెప్పారు.

మొత్తంగా చూస్తే.. రాష్ట్ర ప్ర‌భుత్వం బీసీ నాయ‌కుడు అనే కార‌ణంగా న్యూడ్ ఎంపీపై చ‌ర్య‌ల‌కు వ‌వెనుకాడుతున్న స‌మ‌యంలో ఈ విష‌యంపై ఏకంగా రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదులు అంద‌డం సంచ‌ల‌నంగా మారింది. వాస్త‌వానికి ఘ‌ట‌న వెలుగు చూసిన‌ప్పుడు.. ఇంకేముంది.. నిజ‌మ‌ని తేలితే.. క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని.. తాము తీసుకునే చ‌ర్య‌లు ఒక లెస్స‌న్‌గా మిగిలిపోతాయ‌ని.. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి మీడియాకు చెప్పారు. కానీ, బ‌ల‌మైన కుర‌బ సామాజిక వ‌ర్గం నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌నే భ‌యంతో ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకోలేద‌నే విమ‌ర్శ‌లు వున్నాయి. పైగా..

అది అస‌లు ఒరిజిన‌ల్ కాదంటూ.. ఇటీవ‌ల సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి ప‌రిస్థితిలో రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు చేయ‌డం.. ఎంపీ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న‌ట్టేన‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.