Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ లో పెరిగిన గొడవలు, ఆత్మహత్యలు
By: Tupaki Desk | 29 Jun 2020 4:00 AMఓవైపు భారత్ లో కరోనాతో లాక్ డౌన్ మొదలైంది. జనాలంతా ఇంటికే పరిమితమయ్యారు. పనులు చేసుకుంటుంటే ఎవరి బిజీలో వారుంటారు. కానీ ఆదాయం లేని సమయంలో భార్య, భర్త ఇంట్లో ఉంటే ఏమవుతుంది.. సంపాదన లేదని భార్య దెప్పిపొడవడం.. రూపాయి సంపాదన చాతకాదని గుణగడంతో భర్తలు ఊరుకుంటారా? కొట్టేస్తున్నారు. ఇలా లాక్ డౌన్ లో గృహహింస బాగా పెరిగిపోయిందని.. ఆత్మహత్యలు బాగా ఎక్కువయ్యాయని ఓ అధ్యయనంలో తేలింది.
లాక్ డౌన్ కాలంలో ఆత్మహత్య, గృహహింస కేసులు పెద్ద ఎత్తున పెరిగినట్లు గణాంకాల ద్వారా తెలిసింది. ఒక్క పంజాబ్ లోని లుథియానాలోనే లాక్ డౌన్ కాలంలో 100 ఆత్మహత్య, 1500 గృహహింస కేసులు నమోదైనట్టు తెలిసింది. ఈ ఏడాది లాక్ డౌన్ కు ముందు వీటి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. లాక్ డౌన్ కు ముందు 60 ఆత్మహత్యలు, 850 గృహహింస కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.
ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు డిప్రెషన్, మానసిక ఒత్తిడి, నిరుద్యోగం, ఆర్థిక కారణాల వల్ల చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడైంది. 30-40 ఏళ్ల వయసువారిలో ఆత్మహత్య భావం ఎక్కువగా ఉన్నట్లు తమ పరిశీలనలో గ్రహించినట్లు తెలిపారు. లాక్ డౌన్ వల్ల భార్యభర్తలు ఇళ్లలోనే ఉన్న నేపథ్యంలో గృహహింస కేసులు కూడా ఎక్కువగా జరిగాయని తెలిపారు.