Begin typing your search above and press return to search.
ముగ్గురు విద్యార్థులపై 377 సెక్షన్ కేసుపెట్టారు!
By: Tupaki Desk | 25 July 2016 9:20 AM GMTముగ్గురు విద్యార్థులపై 377 సెక్షన్ కింద ముంబై పోలీసులు కేసులు నమోదు చేశారు. పైగా వారంతా 5 - 6 తరగతులు చదువుతున్న వారే కావడం ఇందులో ట్విస్ట్. హోమో సెక్సువల్ నేరాలపై ప్రయోగించే ఈ చట్టం ఆ విద్యార్థులపై పెట్టడానికి గల కారణాలు.. భవిష్యత్తులో విద్యార్థుల మనోబావాలు ఎలా ఉండబోతున్నాయి అనే ప్రశ్నను లేవనెత్తేవిగా ఉన్నాయి అనే అనుకోవాలి.
విషయానికొస్తే.. దక్షిణ ముంబైలోని ఒక స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని - తన ప్రవేట్ పార్ట్స్ టచ్ చేశారని తన పేరెంట్స్ కు చెప్పాడు ఐదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి. దీంతో ఆ అబ్బాయి పేరెంట్స్ స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించడం, వారంతా మిగిలిన ఆరోతరగతై విద్యార్థుల తల్లితండ్రులను పిలిపించి మాట్లాడటం జరిగిపోయాయి.
ఈ వ్యవహారం అక్కడితో ఆగకుండా విద్యార్థులు ఒకరిపై ఒకరు ఇవే ఆరోపణలు చేసుకోవడంతో వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. విషయం తెలుసుకున్న పోలీసులు వారిపై 377 సెక్షన్ కింద కేసు నమోదు చేసి - వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తప్పు చేసిన వారిని చిల్డ్రన్స్ కరెక్షన్ హోమ్ కు పంపుతామే తప్ప అరెస్టుల వంటివేమీ ఉండవని పోలీసులు వెల్లడించారు. తర్వాత జరిగే పరిణామాల సంగతి అటుంచితే.. పాఠశాలల్లో గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ లకు సంబంధించిన విషయాలను ప్రతీ విద్యార్థికీ అర్ధమయ్యేలా చెప్పాలనే డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతుంది. ఈ విషయంలో తల్లితండ్రుల పాత్ర కూడా చాలా ముఖ్యమనే చెప్పాలి!