Begin typing your search above and press return to search.

అక్కడ 100% వ్యాక్సినేషన్ ను పూర్తి

By:  Tupaki Desk   |   20 Dec 2021 5:17 AM GMT
అక్కడ 100% వ్యాక్సినేషన్ ను పూర్తి
X
భారత్ కరోనా తగ్గుముఖం పట్టింది. మరో వైపు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే సుమారు 150 కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు చేపట్టింది. గతంలో డెల్టా వైరస్ మనల్ని ఏ విధంగా దెబ్బ తీసిందో గుర్తెరిగిన ప్రభుత్వాలు.. ఆ వైరస్ కట్టడి దిశగా అడుగులు వేస్తున్నాయి. అందుకే క్షేత్ర స్థాయిలో వైరస్ టీకా పంపిణీ కార్యక్రమంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిస్థాయిలో అడ్డుకోవాలి అంటే ఏకైక మార్గమైన వ్యాక్సినేషన్ పై దృష్టి సారించి పెద్ద ఎత్తున పంపిణీకి తెర తీసింది. ఈ క్రమంలోనే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైరస్ పంపిణీకి తగిన ఏర్పాట్లు చేసింది. దీంతో పెద్ద ఎత్తున పంపిణీ కార్యక్రమానికి ప్రారంభించింది. ఇప్పటికే మన దేశంలో వంద కోట్లకు పైగా కరోనా టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా ఈ సంఖ్య సుమారు 135 కోట్ల వరకు చేరుకున్నట్లు కేంద్ర వెల్లడించింది. ఇదిలా ఉంటే మొదటి, రెండు డోసులు ప్రకారం చూస్తే... మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య సుమారు 80 శాతానికి పైనే ఉంది.

మరోవైపు రెండో తీసుకున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.ఈ క్రమంలోనే భారత్ భూభాగ మైనటువంటి అండమాన్ నికోబార్ దీవులు టీకా పంపిణీ పరంగా ఓ రికార్డు సొంతం చేసుకున్నాయి. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన ఈ టీకా పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. అక్కడి ప్రభుత్వ లెక్కల ప్రకారం వంద శాతం మందికి వాక్సినేషన్ అందజేసినట్లు స్థానిక అధికార యంత్రాంగం పేర్కొంది. మొత్తం ఉన్న జనాభా లో 74.67 శాతం మందికి కరోనా రెండు డోసులు ఇచ్చింది. దీంతో తొలి కేంద్ర పాలిత ప్రాంతంగా రికార్డు సృష్టించింది.

మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన హిమాచల్ ప్రదేశ్ కూడా అర్హులు అయిన అందరికీ టీకా రెండు డోసులు ఇచ్చింది. ఇలా పూర్తి స్థాయిలో వంద శాతం వ్యాక్సినేషన్ ను పూర్తి చేసి రాష్ట్రంగా కీర్తి గడించింది. ఈ రాష్ట్రంలో ఈ నెల 5 వ తేదీకే వంద శాతం టీకా పంపిణీ పూర్తి చేశారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియను పక్కన పెడితే అక్కడ కేసుల సంఖ్య కూడా చాలా తక్కువ. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో తొలి కేసు నమోదు కావడానికి కొన్ని నెలలు పట్టింది. అయితే తాజాగా ఇలా 100 శాతం టీకాలు పంపిణీ చేయడం గర్వించదగ్గ విషయం అని అధికారులు చెప్తున్నారు. పూర్తిస్థాయిలో టీకా డోసులు అందించిన విషయాన్ని స్థానిక అధికార యంత్రాంగం ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది.