Begin typing your search above and press return to search.
అచ్చు తండ్రిలానే కొడుకూ కలను ఆవిష్కరించారు
By: Tupaki Desk | 17 Dec 2015 6:14 AM GMTగ్రేటర్ ఎన్నికల మీద గురి పెట్టిన మంత్రి కేటీఆర్.. వరాల మీద వరాలు ఇచ్చేస్తున్నారు. తాజాగా హుస్సేన్ సాగర్ మీద ఆయన చేసిన వ్యాఖ్య చూసినప్పుడు.. సరిగ్గా ఏడాది క్రితం కేటీఆర్ తండ్రి.. ముఖ్యమంత్రి... కేసీఆర్ చెప్పిన మాటలు గుర్తుకు రావటం ఖాయం. గత అక్టోబర్ లో కేసీఆర్ మాట్లాడుతూ.. వేసవి నాటికి సాగర్ ను ఖాళీ చేయించి.. వర్షాకాలం నాటికి మంచినీటితో నింపుతామని.. 2015 వర్షాకాలంతో సాగర్ రూపు రేఖలు మారిపోతాయని చెప్పారు.
మంచి మాటకారి అయిన కేసీఆర్ మాటలు విన్నప్పుడు.. రంగుల సినిమా కనిపిస్తుంది. అందుకు తగ్గట్లే ఊహాలోకంలోకి పయనిస్తాం. సాగర్ వ్యవహారంలో కేసీఆర్ చెప్పిన మాటలకూ అదే పరిస్థితి. హుస్సేన్ సాగర్ విషయంలో కేసీఆర్ చెప్పిన మాటలకు.. చేతలకు మధ్యనున్న అంతరం ఏమిటో అందరికి తెలిసిందే. సాగర్ ను ఖాళీ చేయటం సాధ్యం కాదని తేల్చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా కేసీఆర్ కుమారుడు మరో కలను ఆవిష్కరించారు.
వచ్చే వేసవి నాటికి హుస్సేన్ సాగర్ ను మంచినీటితో నింపేస్తామని.. ఇప్పటివరకూ వాసన కారణంగా ముక్కు మూసుకుంటున్నారని.. వచ్చే వేసవి నాటికి పరిస్థితి మొత్తం మారుస్తామన్న వరాన్ని ఇచ్చేశారు. తాజాగా కేటీఆర్ మాటలు వింటే.. తండ్రేమో సాగర్ ను ఖాళీ చేసి.. సిల్ట్ తీసేసి మంచినీటితో నింపేస్తామంటే.. కొడుకేమో.. చుక్క మురుగు నీరు సాగర్ లోకి పోకుండా చేసి మంచినీటితో నింపేస్తామని చెప్పటం చూస్తే.. కలల్ని ఆవిష్కరించటంలో తండ్రికి.. కొడుకు ఏ మాత్రం తీసిపోడనిపించక మానదు.