Begin typing your search above and press return to search.
ఒక్క సిగరెట్.. 300 కార్లు బుగ్గి..
By: Tupaki Desk | 24 Feb 2019 4:44 AM GMTబెంగళూరులో ఈ దఫా నిర్వహించిన వైమానిక ప్రదర్శన అందరికీ చేదు అనుభవాలను మిగిల్చింది.. రిహార్సల్స్ సమయంలో ఆకాశంలో రెండు సూర్య కిరణ్ విమానాలు ఢీకొన్న ఘటనలో ఒక పైలెట్ చనిపోయాడు. ఆ ఘటన విషాదం నింపింది. దీన్ని మరిచిపోకముందే ‘ఏరో ఇండియా2019’ పేరిట బెంగళూరులో నిర్వహించిన ఎయిర్ షోలో దారుణ విషాదం చోటుచేసుకుంది. పార్కింగ్ ప్లేస్ భారీ అగ్ని ప్రమాదం జరిగి 300 కార్లు బుగ్గిపాలయ్యాయి.
*ఎక్కడ జరిగింది..?
బెంగళూరులోని యలహంకలో జరుగుతున్న ఎయిర్ షోకు రెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన గేట్ నంబర్-5 వద్ద పార్కింగ్ లో దాదాపు 1000కు పైగా కార్లను నిలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో విమానాల విన్యాసాలు జోరందుకున్న వేళ.. కార్లు నిలిపిన ప్రాంతంలో ఎవరో సిగరెట్ ఆర్పకుండా పడేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు..
*ఎలా జరిగింది.?
సిగరేట్ ఆర్పకుండా కార్ల వద్దే ఎవరో పడేయడంతో అగ్ని అంటుకుంది. పార్కింగ్ ప్రదేశంలో భారీగా ఎండుగడ్డి ఉండడం.. బలమైన గాలులు రావడం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. మంటల్ని అదుపులోకి తెచ్చేలోపే అక్కడ పార్క్ చేసిన ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. కారులో ఉంచిన డ్రైవింగ్ లైసెన్స్ లు, పాస్ పోర్టులు, పత్రాలు, విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. వెయ్యికిపైగా కార్లకు నిప్పు అంటుకోగా.. సహాయ సిబ్బంది మిగతా కార్లను దూరంగా తప్పించడంతో మిగతా కార్లను కాపాడుకోగలిగారు.
*భారీ ప్రమాదం, ప్రాణనష్టం తప్పింది.. కోట్లలో నష్టం..
వైమానిక ప్రదర్శన వేదికకు కార్ల పార్లింగ్ రెండు కిలోమీటర్ల దూరం ఉండడంతో విమానాలకు, విన్యాసాలకు పెద్ద ప్రమాదం తప్పింది. అదే విమానాలకు అంటుకుంటే నష్టం తీవ్రంగా ఉండేది. ఆ ఇంధనంతో పెను ప్రమాదం వాటిల్లి వందలాది మంది ప్రాణ నష్టం సంభవించి ఉండేది. ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.. ప్రాణపాయం వాటిల్లకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ 300 కార్లు దగ్ధమవడంతో కోట్లలో నష్టం వాటిల్లి బాధితులంతా బోరుమన్నారు.