Begin typing your search above and press return to search.
రేపటి నుంచి సంపూర్ణ లాక్డౌన్..! సరుకులు ఇవాళే తెచ్చుకోండి..!
By: Tupaki Desk | 23 May 2021 6:30 AM GMTదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్డౌన్ విధిస్తున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. అయితే సంపూర్ణ లాక్డౌన్ విధించడం.. కఠిన ఆంక్షలు అమలు చేయడంతో ఢిల్లీలో కేసులు తగ్గాయి. దీంతో మిగిలిన రాష్ట్రాలు సైతం ఇదే పద్ధతిని అవలంభించాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. తమిళనాడులో ఇప్పటికే లాక్డౌన్ అమల్లో ఉంది. అయితే కొన్ని సడలింపులు విధించారు.
అయితే తమిళనాడులో కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.సోమవారం నుంచి తమిళనాడు రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించబోతున్నట్టు ఆయన ప్రకటించారు. కరోనా కట్టడికి లాక్డౌన్ మించి వేరే మార్గం ఏదీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం నుంచి రాష్ట్రంలో అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని సేవలను కంప్లీట్ గా బంద్ చేయనున్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని తెలిసినా.. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
పాక్షిక లాక్డౌన్తో పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని ఆయన పేర్కొన్నారు. కఠిన లాక్డౌన్ను మే 31 వరకు అమలు చేయబోతున్నట్టు స్టాలిన్ ప్రకటించారు.
ఆదివారం రాత్రి 9 గంటల వరకే అన్ని దుకాణాలు తెరిచిఉంటాయి. కాబట్టి.. ఏం కావాల్సిన కొనుగోలు చేయడానికి ఈ ఒక్కరోజే అనుమతి ఇచ్చారు. దీంతో ఆదివారం రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు తెలుగురాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ .. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది.