Begin typing your search above and press return to search.
మహారాష్ట్ర లో మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ !
By: Tupaki Desk | 12 March 2021 2:30 PM GMTకరోనా వైరస్ పేరు విని విని అందరికి విరక్తి వస్తుంది కానీ, ఆ వైరస్ కి మాత్రం విరక్తి రావడంలేదు. రోజురోజుకి ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందుతుపోతుంది. కరోనా వ్యాక్సినేషన ప్రక్రియ దేశంలో ఓ వైపు వేగంగా కొనసాగుతున్నా కూడా దేశంలో కరోనా మహమ్మారి మాత్రం తగ్గడంలేదు. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే రోజుల్లో భారత్ లో కరోనా మరింతగా విజృంభించే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే...ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యేది మహారాష్ట్రలోనే .. ఈ క్రమంలో మహా సర్కార్ త్వరలో మహారాష్ట్ర లో మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ వేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఇప్పటికే 8 జిల్లాల్లో కరోనా కలకలం సృష్టిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జిల్లాలో కఠిన ఆంక్షలు విదిస్తుంది. తాజాగా పుణేలో రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు అకోలాలో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను ప్రకటించారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి లాక్ డౌన్ ప్రారంభమవుతుందని తెలిపారు. అటు పర్భాని జిల్లాలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక నాగ్‌పూర్‌లో ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించారు. మార్చి 15 నుంచి 21 వరకు వారం రోజుల పాటు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని మంత్రి నితిన్ రౌత్ తెలిపారు. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. పాలు, నిత్యావసర సరకులు, కూరగాయలు, పండ్లు, మందుల షాపులు మాత్రమే తెరిచి ఉంటాయని చెప్పారు. అంతకుముందే జల్ గావ్ జిల్లాలో జనతా కర్ఫ్యూ విధించారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాగే ఉంటే త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ లాక్ డౌన్ విధించాల్సి వస్తుందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
ఇక , కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లను 50 శాతం కెపాసిటీతో మాత్రమే నడుపుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కర్ఫ్యూ అమల్లో ఉన్న ప్రాంతాల్లో నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడదని హెచ్చరికలు జారీ చేశారు. గురువారం 14,317 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మహారాష్ట్ర కరోనా కేసుల సంఖ్య 22,66,374కు ఎగబాకింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,06,070 యాక్టివ్ కేసులున్నాయి.