Begin typing your search above and press return to search.
సెకండ్ వేవ్ : ఆ మూడు రాష్ట్రాల్లో మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ !
By: Tupaki Desk | 8 May 2021 4:35 AM GMTకరోనా దెబ్బకి వణికిపోతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. ప్రతి రోజూ కూడా అక్కడ రికార్డు స్థాయిలో 50 వేలకి పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. కేవలం బెంగళూరు మహానగరంలోనే సగం కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికీ కొవిడ్ వ్యాప్తి విశృంఖలంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నెల 10న (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 24 ఉదయం 6 గంటల వరకూ పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప శుక్రవారం ప్రకటించారు. కరోనా కర్ఫ్యూ విఫలం కావడం వల్లే లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం తెలిపారు.
కరోనా లాక్ డౌన్ సందర్భంగా కర్ణాటక వ్యాప్తంగా అన్ని హోటళ్లు, పబ్బులు, బార్లు మూసి ఉంటాయని సీఎం తెలిపారు. ఇక హోటళ్లు, మాంసం దుకాణాలు, కూరగాయల దుకాణాలు మాత్రం ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ తెరిచి ఉంటాయని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసు అధికారులను ఆదేశించారు. మెడికల్ సంబంధమైన వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్టు యడియూరప్ప తెలిపారు. ఉదయం 10గంటల తర్వాత రోడ్డుపై ఒక్కరికి కూడా అనుమతి లేదని సీఎం తేల్చి చెప్పారు. కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నందు వల్లే లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నామని,ఇది తాత్కాలిక నిర్ణయమేనని, వలస కూలీలు రాష్ట్రాన్ని వీడొద్దని సూచించారు.
ఇక కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో తమిళనాడు ప్రభుత్వం 14 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ , వీకెండ్ లాక్ డౌన్ ను ఇప్పటికే అమల్లోకి తీసుకువచ్చాయి. కానీ ,వీటితో కరోనా ఏ మాత్రం కంట్రోల్ అవ్వడంలేదు. దీనితో పలు రాష్ట్రాలు మళ్లీ పూర్తిగా లాక్ డౌన్ పెట్టాలని నిర్ణయించుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో తమిళనాడు కూడా చేరింది. ఈ నెల 10 నుంచి 24 వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు తమిళ సర్కార్ అధికార ప్రకటన చేసింది. ఇక కేరళ ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 16 వరకు లాక్డౌన్ను ప్రకటించింది. మొత్తంగా ఒక్కొక్క రాష్ట్రం మరోసారి కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోతున్నాయి.