Begin typing your search above and press return to search.
విశాఖలో వైసీపీ.. టీడీపీ మధ్య రాజీ.. ఉప ఎన్నికల్లో రెండు పార్టీలదీ ఒకటే మాట
By: Tupaki Desk | 5 Nov 2021 6:34 AM GMTఉప్పు.. నిప్పులా ఉంటుంది ఏపీలో రాజకీయం. అందునా.. అధికార వైసీపీ.. టీడీపీల మధ్య రాజకీయ పోరు ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటిది అందుకు భిన్నంగా రాజీ ఫార్మాలాను రెండు పార్టీలు ఫాలో కావటం ఆసక్తికరంగా మారింది. ఇందుకు విశాఖ వేదికగా మారింది. రాష్ట్రంలో మరెక్కడా లేని ఈ తీరు విశాఖలోనే ఎందుకు ఉంది? అందుకు రెండు పార్టీల అగ్రనేతలు సైతం సమర్థించుకోవటం గమనార్హం. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..
ఏపీలోని పెండింగ్ మున్సిపాలిటీ.. స్థానిక సంస్థల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఖాళీ అయిన చోట ఉప ఎన్నికల్ని నిర్వహించే దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో విశాఖ జీవీఎంసీలోనూ ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు ఉప ఎన్నికల్ని నిర్వహించనున్నారు. నగరంలోని 31వ వార్డు టీడీపీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ కరోనాతో మరణిస్తే.. 61వ వార్డు కార్పొరేటర్ వైసీపీకి చెందిన సూర్యకుమారి గుండెపోటుతో చనిపోయారు. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల్ని భర్తీ చేసేందుకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే జారీ కావటమే కాదు.. బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది.
తాజాగా అందుతున్న సమాచారాన్ని చూస్తే.. అధికార.. విపక్షాలకు చెందిన ఈ రెండు స్థానాల్ని.. ఎవరికి వారు ఏకగ్రీవం అయ్యేలా చూసుకోవాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇందుకు పార్టీ అధినాయకత్వం కూడా సానుకూలంగా ఉందని చెబుతున్నారు. టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానంలో అధికార వైసీపీ పోటీ చేయకూడదని భావిస్తుందని.. అదే సమయంలో వైసీపీకి చెందిన స్థానంలో టీడీపీ పోటీ చేయకూడదన్న నిర్ణయంలో ఉందని చెబుతున్నారు.
అంతేకాదు.. రెండు స్థానాలకు మరణించిన కార్పొరేటర్ కుటుంబాలకు చెందిన అభ్యర్థుల్ని ప్రకటించాలని.. అలా చేస్తే.. ఎన్నిక లేకుండా ఏకగ్రీవం చేయాలని రెండుపార్టీల ఆలోచనగా చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రజాసేవ చేస్తూ మరణించిన వారి కటుంబ సభ్యులకు ఆయా పార్టీలు టికెట్ ఇస్తే.. పోటీ చేయకూడదని..రాజకీయ విలువలకు పార్టీ కట్టుబడి ఉన్నట్లుగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సైతం వ్యాఖ్య చేయటం చూస్తే.. ఈ రెండు డివిజన్లను రెండు పార్టీలు ఏకగ్రీవం దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దీని కారణంగా అనవసరమైన రాజకీయ పరిణామాలకు అవకాశం ఇవ్వకుండా ఉండటంతో పాటు.. ఒక మంచి సంప్రదాయాన్ని రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కొనసాగించాలన్నట్లుగా అధికార.. విపక్ష పార్టీల ఆలోచనగా చెబుతున్నారు.
ఇందుకు తగ్గట్లే.. ఇటీవల బద్వేల్ లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ.. విపక్ష టీడీపీ పోటీ చేయకుండా ఉండటం తెలిసిందే. ఇప్పటివరకుపార్టీ అంతర్గతంగా సాగుతున్న చర్చలకు తగ్గట్లే.. ఇరు పార్టీలు తమ అభ్యర్థుల్ని బరిలోకి దించకుండా.. తెర వెనుక మాట్లాడుకున్నట్లే ఎన్నికను ఏకగ్రీవం చేస్తే.. ఈ వైనం కచ్ఛితంగా హాట్ టాపిక్ కావటం ఖాయమంటున్నారు. ఈ ఎన్నికపై పూర్తిస్థాయి స్పష్టత శుక్రవారం వస్తుందని చెబుతున్నారు. ఒకవేళ.. ఇప్పటివరకు సాగుతున్న చర్చలకు అనుగుణంగా.. పోటీ లేకుండా అధికార.. విపక్ష పార్టీలు రెండూ ఒకే మాట మీద నిలబడి పోటీకి దూరంగా ఉంటే మాత్రం కొత్త రాజకీయానికి తెర తీసినట్లే అవుతుందని చెప్పక తప్పదు.