Begin typing your search above and press return to search.

మహా కూటమి కోసం కామ్రేడ్స్ రెడీ...బీజేపీకి హ్యాండ్ ..

By:  Tupaki Desk   |   19 Oct 2022 11:30 AM GMT
మహా కూటమి కోసం కామ్రేడ్స్ రెడీ...బీజేపీకి హ్యాండ్ ..
X
ఏపీలో 2009 నాటి మహా కూటమి మరోసారి ఏర్పాటు కాబోతోందా. అంటే కామ్రేడ్స్ మాటలను బట్టి చూస్తే అదే జరిగేలా ఉంది అంటున్నారు. ఏపీలో పొత్తులకు ఒక అడుగు ముందుకు పడింది. దానికి పెద్దన్నగా చంద్రబాబు కీలకమైన బాధ్యతలను తీసుకున్నారు. ఆయన స్వయంగా విజయవాడ వెళ్ళి పవన్ బస చేసిన హొటల్ లోనే ఆయనతో చర్చలు జరిపి అయిదేళ్ల క్రితం నాటి పాత స్నేహాన్ని తిరిగి పట్టాలెక్కించే పనిలో పడ్డారు.

పొత్తులు ఇక ఖాయమే మాట అంతటా వినిపిస్తోంది. మరో వైపు చూస్తే బీజేపీ కూడా ఈ కూటమిలో చేరుతుంది అని వినిపిస్తున్నా ప్రస్తుతానికి అదంత సులువు కానే కాదు అంటున్నారు. అయితే బీజేపీ కనుక దూరంగా ఉంటే ఆ ప్లేస్ లోకి రావడానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సిద్ధంగానే ఉన్నాయని అంటున్నారు.

దీని మీద సీపీఐ రామక్రిష్ణ మాట్లాడుతూ బీజేపీ కనుక లేకపోతే జనసేన టీడీపీ కూటమిలో తాము చేరడానికి రెడీ అని ప్రకటించారు. ఏపీలో బీజేపీ వైసీపీకే మద్దతుగా ఉంది కాబట్టి ఆ పార్టీని వీడాల్సిందే అని ఆయన అంటున్నారు. తన మాజీ మిత్రుడు పవన్ కళ్యాణ్ కి ఇదే విషయాన్ని ఆయన మీడియా ముఖంగానే స్పష్టం చేశారు. బీజేపీని వీడే విషయంలో పవన్ క్లారిటీ ఇస్తే జగన్ని ఏపీలో ఉమ్మడిగా ఎదుర్కొనే విషయంలో సీపీఐ కూడా సహకరిస్తుంది అన్నట్లుగా ఆయన మాట్లాడారు.

మరో వైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కూడా ఇదే రకమైన కామెంట్స్ చేశారు. ఏపీలో ఉమ్మడి కార్యాచరణ అవసరం అని వైసీపీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా అంతా కలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ఇప్పటికే పిలుపు ఇచ్చారు. దానికి రియాక్ట్ అవుతూ కామ్రెడ్స్ మేము రెడీ అని అంటున్నారు. అయితే బీజేపీ లేని కూటమిలోకే వారు రావాలనుకుంటున్నారు.

ఇక ఏపీలో బీజేపీ మీద జనసేన టీడీపీ ఏ విధంగా ఆలోచిస్తున్నాయో చూడాలి. అలాగే ఏపీలో బీజేపీ స్టాండ్ కూడా ఎలా ఉండబోతోంది అన్న దానిని బట్టే కామ్రేడ్స్ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశాలు ఆధారపడి ఉంటాయని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే బీజేపీ కంటే కామ్రేడ్స్ తో వెళ్లడమే బెటర్ అని బాబు పవన్ కనుక భావిస్తే మాత్రం ఏపీలో విపక్ష రాజకీయం టోటల్ గా మారుతుంది. అపుడు కాంగ్రెస్ బీజేపీ ఒంటరి పోరుకే సిద్ధపడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఏపీలో రాజకీయాలు మార్చే విధంగానే పవన్ ఫ్యాక్టర్ పనిచేస్తొంది అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.