Begin typing your search above and press return to search.
ఎగ్జిట్ పోల్స్ సాక్షి గా చీలిపోయిన కామ్రేడ్లు
By: Tupaki Desk | 8 Dec 2018 11:41 AM GMTతెలంగాణ లో జరుగుతున్న ముందస్తు ఎన్నికల పర్వం లో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగిసిన సంగతి తెలిసిందే. ఫలితాలకు మరో రెండ్రోజుల సమయం ఉండగా.. తమదే గెలుపు.. కాదు.. తామే గెలుస్తాం.. ప్రత్యర్థులను మట్టికరిపిస్తాం.. ఈసారి అధికారంలో కి వచ్చేస్తున్నాం.. అంటూ ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 2014లో టీఆర్ఎస్ కు పట్టం కట్టిన ప్రజలు 2018లో జరిగిన ఎన్నికల్లో సైతం గులాబీ కి జై కొడుతారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం భిన్నంగా వచ్చాయి... దీని తో విజయం పై హస్తం నేతలు ధీమా గా ఉంటున్నారు. 62-70 స్థానాల్లో విజయం సాధిస్తామని.. ప్రజాకూటమి అధికారంలో కి వస్తుందని నేతలు పేర్కొంటున్నారు. అయితే, ఈ ఎపిసోడ్ పై కమ్యూనిస్టుల్లో చీలికకు కారణం అయింది. వామపక్ష భావజాల పార్టీ కి చెంది ఇద్దరు ముఖ్య నేతలు వేర్వేరుగా స్పందించడం గమనార్హం.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన సర్వే లు చూస్తుంటే టీఆర్ఎస్ కే అనుకూలంగా ఉండే ఆవకాశం ఉందని అన్నారు. సీపీఎం ఆ సర్వేలను అదే విధంగా చూస్తుందని పేర్కొన్నారు. పోలింగ్ ప్రారంభం లో కొంత గందరగోళం ఉన్న సాయంత్రం వరకు పరిస్థితులు మారాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పేర్కొన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వే లో ఆయనకే సరైన క్లారిటీ లేదని ఎద్దే వా చేశారు. ఈ ఎలక్షన్ల లో డబ్బులు, మద్యం ఏరులై పారిందని తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. టీఆర్ఎస్- మహాకూటమి లో ఎవరూ అధికారంలోకి వచ్చిన పెద్దగా ఒరిగేది ఏ ఉండదన్నారు.
ఇది లా ఉండగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అదే టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలు గందరగోళంను సృష్టించాయన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తమను గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జాతీయ మీడియా సంస్థలకు క్షేత్రస్థాయి పరిణామాల పై అవగాహన ఉండదని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సహా ఓ పత్రిక చేసిన సర్వే వాస్తవానికి దగ్గరగా ఉందని తమకు అనిపించిందన్నారు. సర్వేలు చెప్పేదే ఫైనల్ కాదని, 11వ తేదీన ఫలితం తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.