Begin typing your search above and press return to search.
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు : భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలకు షరతులతో కూడిన బెయిల్ !
By: Tupaki Desk | 9 March 2021 11:31 AM GMTఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి , మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా భర్త కి బోయిన్ పల్లి కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కి బెయిల్ ఇస్తూ , కొన్ని షరతులు విధించింది. బోయినపల్లి కిడ్నాప్ కేసు గురించి వెలుగులోకి వచ్చిన మరుక్షణమే భార్గవ్ రామ్ అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు. పోలీసులు ఎంతగా వెదికినా అయన ఆచూకీ మాత్రం లభించలేదు. ఆ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ కేసు వెలుగులోకి వచ్చిన సమయం నుండి పోలీసులకి దొరకకుండా అజ్ఞాతం లో ఉన్న భార్గవ్ రామ్ కి , అజ్ఞాతం లో ఉండగానే కోర్టులో బెయిల్ లభించడం గమనార్హం. ఇదే కేసులో భార్గవ్ రామ్ తో పాటుగా భూమా నాగిరెడ్డి తనయుడు భూమా జగత్ విఖ్యాత్ కు కూడా కోర్టు బెయిల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. తాజా విచారణలో మొత్తం ఆరుగురు నిందితులు బెయిల్ పొందారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్గవరామ్ తల్లిదండ్రులు కిరణ్మయి, నాయుడులకు కూడా బెయిల్ లభించింది. ఇతర నిందితులు సిద్ధార్థ, మల్లికార్జునరెడ్డి కూడా బెయిల్ పొందారు.
ఇటీవల మాజీ మంత్రి అఖిలప్రియ ఓ భూవివాదంలో ప్రవీణ్ రావు, నవీన్, సునీల్ ను కిడ్నాప్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోలీసులు కస్టడీకి తీసుకోని ఆమెని విచారించారు. ఆ తర్వాత అఖిల ప్రియకి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. తాజాగా ఇదే కేసులో ఆమె భర్త భార్గవ్ రామ్ , తమ్ముడు జగత్ విఖ్యాత్ కి కూడా బెయిల్ మంజూరుచేసింది. ఈ కేసులో ఏ1 గా ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో ఏ2గా ఏవీ సుబ్బారెడ్డిని, ఏ3 గా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ఉన్నారు.