Begin typing your search above and press return to search.
'క్రాకర్స్’కు ఓకే చెప్పిన ఆ రాష్ట్రాలు .. ఏపీ , తెలంగాణ లో కండిషన్స్ అప్లై !
By: Tupaki Desk | 2 Nov 2021 9:30 AM GMTదీపావళి సమయంలో రాష్ట్రంలో బాణ సంచా డీలర్లు, విక్రేతలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. కరోనా వైరస్ వ్యాప్తి, వాయు కాలు ష్యం దృష్ట్యా తెలంగాణ వ్యాప్తంగా టపాసుల విక్రయాలు, వినియోగంపై నిషేధం విధిస్తూ హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పును సర్వో న్నత న్యాయస్థానం శుక్రవారం స్వల్పంగా సవ రించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా గాలి నాణ్యత సూచీల ప్రకారం రాష్ట్రంలో గ్రీన్ క్రాకర్స్ విక్రయాలు, వినియోగానికి ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సమయాన్ని నిర్దేశించకపోతే దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ వంటి ప్రత్యేక తేదీల్లో గాలి నాణ్యత సాధారణంగా ఉన్న ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలన్న ఎన్జీటీ ఆదేశాలను తెలంగాణలోనూ అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ తెలంగాణ ఫైర్‌వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ (టీఎఫ్‌డబ్ల్యూడీఏ) దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సాధారణ క్రాకర్స్‌తో పోల్చితే గ్రీన్ క్రాకర్స్ 35 శాతం తక్కువ కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. దివాళి నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలు వివిధ రకాలుగా ఉన్నాయి.
ఢిల్లీ : దీపావళి నాడు , బాణసంచా పేల్చ వద్దంటోంది ఢిల్లీ ప్రభుత్వం. క్రాకర్స్ కాల్చితే, భారీ జరిమానా తప్పదు అని చెప్పింది. టపాసులు విక్రయించేందుకు ఎవరికి అనుమతి లేదంటూ ఏకంగా లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసింది. ఇప్పటికే పంటల వృధా కాల్చివేతతో కాలుష్యం పెరుగుతోంది. మరో వైపు వాహనాలతో వచ్చే కాలుష్యం ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు టపాసులకు అనుమతి ఇవ్వడమంటే, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే టపాసుల వాడకంపై బ్యాన్ విధించింది. క్రాకర్స్ కాల్చివేత వృద్ధులు, చిన్నారులకు ప్రమాదమని ప్రభుత్వం గుర్తు చేస్తోంది.
కర్నాటక
కర్నాటక మాత్రం గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని అంటోంది. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ పాటిస్తూ... అనుమతి ఉన్న దుకాణదారులే గ్రీన్ క్రాకర్స్ విక్రయించాలని చెప్తోంది. మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో క్రాకర్స్ కాల్చవద్దంటోంది రాష్ట్ర ప్రభుత్వం.
పంజాబ్
పంజాబ్ మాత్రం గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవడానికి కేవలం రెండు గంటల సమయం ఇచ్చింది. సాధారణ టపాసుల తయారీ, అమ్మకాన్ని నిషేధించింది.
ఉత్తర ప్రదేశ్
ఉత్తర ప్రదేశ్ టపాసులు పేల్చడాన్ని కంప్లీట్‌గా నిషేధించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యుల్ రూల్స్ అమలయ్యేలా చూడాలంటూ ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు టపాసుల కాల్చివేతకు అనుమతించింది.
తమిళనాడు
బేరియం లవణాలు కలిగిన టపాసుల వినియోగాన్ని నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తే క్రిమినల్ ప్రాసిక్యూషన్ తప్పదని తమిళనాడు హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్
గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వాడాలంటోంది ఏపీ ప్రభుత్వం. అది కూడా రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అంటూ నిబంధన విధించింది. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని టపాసులకు బదులు.. గ్రీన్ క్రాకర్స్ కాల్చాలని ప్రభుత్వం చెప్తోంది.
తెలంగాణ
హైదరాబాద్ లో దీపావళి టపాసులపై ఆంక్షలు విధించారు. శబ్ద కాలుష్యం కలిగించే టపాసుల విక్రయంపై నిషేధం విధిస్తున్నాం, నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మార్గదర్శకాలు అమలుచేస్తామని GHMC కమిషనర్ లోకేష్ కుమార్ ప్రకటించారు.