Begin typing your search above and press return to search.
ఇదేం కండోమ్ రచ్చ.. హవ్వా.. ఏకంగా మహిళల సీట్లపైనే!
By: Tupaki Desk | 12 Aug 2022 6:33 AM GMTఆధునికంగా, సాంకేతికంగా మనదేశం ఎంత ముందంజ వేస్తున్నప్పటికీ ఇప్పటికీ దేశం కొన్ని విషయాల్లో సంప్రదాయ దేశంగానే ఉంటోంది. ముఖ్యంగా సెక్స్, లైంగిక సంబంధాలకు సంబంధించి పెద్దగా బయటకు చర్చించడానికి కూడా ఇష్టపడరు. అలాగే వాటికి సంబంధించిన వస్తువులు లేదా ప్రకటనలు ఏమైనా ఇంకా భారతీయులు గుట్టుమట్టుగానే అన్నట్టు వ్యవహరిస్తారు.
అలాంటి దేశ రాజధాని ఢిల్లీ మెట్రోలో కండోమ్ యాడ్ ఒకటి రచ్చ రచ్చ చేసింది. అందులోనూ మహిళా ప్రయాణికులు కూర్చునే సీట్లపైన ఈ కండోమ్ యాడ్ ఉండటం తీవ్ర రచ్చకు కారణమైంది. ఈ యాడ్ ను తమ సీట్లపైన చూసిన కొంతమంది మహిళా ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. అంతేకాకుండా తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.
ఒక ట్విట్టర్ యూజర్ బుధవారం సోషల్ మీడియాలో ఢిల్లీ మెట్రో రైలులో ఉన్న కండోమ్ ప్రకటనను ఫొటో తీసి ట్విట్టరులో పోస్టు చేశాడు. దీంతో అది వైరల్‌గా మారింది.
దీంతో మరికొందరు నెటిజన్లు ఢిల్లీ మెట్రో రైలు (DMRC)ని ట్యాగ్ చేసి వెంటనే ఈ కండోమ్ యాడ్ పై చర్యలు తీసుకోండని కోరారు. మహిళల సీట్లపైన కండోమ్ యాడ్ ఏమిటంటూ చాలా మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. తక్షణం ఆ యాడ్ ను ఢిల్లీ మెట్రో రైళ్లలో తొలగించాలని కోరారు.
కాగా మరొక నెటిజన్ తన ట్వీటులో.. "ఢిల్లీ మెట్రో.. మీరు చాలా ప్రగతిశీలంగా మారారా? మహిళల సీటుపై కండోమ్ ప్రకటన? ఇది మీ తప్పు కాదు.. అయితే ఇది పగటిపూట టీవీలో కండోమ్ ప్రకటనలను చూపించకూడదనే నియమాలు ఉన్న దేశం అని మీరు తెలుసుకోవాలి“ అంటూ ట్వీట్ చేశాడు.
మరోవైపు ఢిల్లీ మెట్రో రైలు అధికారులు తాము ఉద్దేశపూర్వకంగా మహిళల కంపార్టుమెంటులో ఆ యాడ్ ను ఉంచలేదని.. దాన్ని గతంలోనే తొలగించామని వివరణ ఇచ్చారు. ఇంకా ఒకటి, అరాచోట్ల ఈ యాడ్ ఉండి ఉంటుందని.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.