Begin typing your search above and press return to search.
బాప్ రే.. అక్కడ ఒక కండోమ్ ప్యాకెట్ రూ.60వేలు
By: Tupaki Desk | 14 Jun 2022 5:30 AM GMTసాధారణంగా ఒక కండోమ్ ప్యాకెట్ దేశంలో ఎంత ఉంటుంది? రూ.15 నుంచి రూ.30లకే దొరకుతుంది. లగ్జరీవి ఓ రూ.100 వరకూ ఉంటాయి. రెండు రూపాయలకు ఒక కండోమ్ కూడా ఉంది. ఇక మన ప్రభుత్వాలు సుఖ వ్యాధులు, ఎయిడ్స్ సోకకుండా ప్రాథమిక కేంద్రాలు, బస్టాండ్ లలో ఉచితంగా అందజేస్తున్నాయి. వాటిని తీసుకొని మన మగాళ్లు ఈ వ్యాధులకు దూరంగా ఉంటున్నారు.
అవాంచిత గర్భధారణ నివారణకు, హెచ్ఐవీ లాంటి వ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకే కండోమ్స్ వాడాల్సిందిగా ప్రభుత్వాలు ప్రచారం చేస్తాయి. కానీ ఒక దేశంలో మాత్రం ఓ కండోమ్ ప్యాకెట్ ధర అక్షరాల రూ.60వేలు. అవును నమ్మశక్యం కాకున్నా ఇది అక్షరాల నిజం. ఇది దక్షిణ అమెరికా ఖండంలోని వెనిజులా దేశంలో.. అక్కడ ఒక కండోమ్ ప్యాకెట్ అంత భారీ ధర పలుకుతోంది.
ఇంత ధర పెరిగిపోవడానికి ప్రధాన కారణం.. వెనిజులాలో నెలకొన్ని ఆర్థిక సంక్షోభమే. ఈ సంక్షోభం కారణంగా ఆ దేశంలోని ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైంది. ధరలన్నీ భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే కండోమ్ ప్యాకెట్ ధర ఏకంగా రూ.60వేలకు చేరింది. బ్రాండెడ్ టీవీలు ఇంతకంటే తక్కువ ధరకే అక్కడ అందుబాటులో ఉన్నాయి.
ఈ రేంజ్ లో అక్కడ కండోమ్ ప్యాకెట్లు ధర పెరగడానికి మరో కారణం కూడా ఉంది. వెనిజులాలో అబార్షన్ లు చట్టవిరుద్ధం. ఎవరైనా అబార్షన్ లకు పాల్పడితే అక్కడ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అందుకే అవాంఛిత గర్భధారణను నివారించేందుకు అక్కడ కండోమ్ ప్యాకెట్ల వాడకం గణనీయంగా పెరిగిపోయింది. అక్కడ భారీ డిమాండ్ పెరిగింది.
డిమాండ్ గరిష్ట స్థాయిలో ఉండడంతో వాటి ధరలను అమాంతం పెంచారు. దీంతో ఏకంగా ప్యాకెట్ ధర రూ.60వేలకు చేరుకుంది.
2015 ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా టీనేజ్ గర్భిణులున్న దేశాల్లో వెనిజులా ఒకటిగా నిలిచింది. పైగా ఇక్కడ అబార్షన్ లపై నిషేధం ఉంది. అలాంటి దేశంలో ఒక కండోమ్ ప్యాకెట్ పై రూ.60వేల ధర అయినా కూడా అక్కడి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎంత సంక్షోభం ఉన్నా ధర మాత్రం అంతా పెంచాలా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.